యూఏఈలో ‘మోల్డోవన్’ హంతకులకు మరణశిక్ష..!!

- April 01, 2025 , by Maagulf
యూఏఈలో ‘మోల్డోవన్’ హంతకులకు మరణశిక్ష..!!

యూఏఈ: మోల్డోవన్-ఇజ్రాయెల్ పౌరుడు జ్వి కోగన్ హంతకులకు యూఏఈ మరణశిక్ష, జీవిత ఖైధు విధించింది. నలుగురు నిందితులు మరణించిన వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితులలో ముగ్గురికి మరణశిక్ష విధించగా, నాల్గవ వ్యక్తికి హత్య చేసినందుకు జీవిత ఖైదు విధించారు.  

గత సంవత్సరం నవంబర్ 25న అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముగ్గురు నేరస్థుల గుర్తింపులను వెల్లడించింది. వారిని ఉజ్బెక్ జాతీయులుగా(ఒలింపి తోహిరోవిక్ (28), మహమూద్ జాన్ అబ్దేల్ రహీమ్ (28), అజీజ్‌బెక్ కమిలోవిక్ (33)) గుర్తించారు.

 నవంబర్ 21న కోగన్ కుటుంబం అతను కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. మూడు రోజుల తర్వాత, తప్పిపోయిన వ్యక్తి కోగన్ హత్యకు గురైనట్లు, ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఎమిరేట్స్‌ అధికారులు టర్కీ సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు.  బాధితుడిని వెంటాడి చంపారని దర్యాప్తులో తేలిన తర్వాత.. అటార్నీ జనరల్, కౌన్సెలర్ డాక్టర్ హమద్ సైఫ్ అల్ షంసీ.. ముగ్గురు నిందితులను, నాల్గవ సహచరుడిపై 2025 జనవరిలో అత్యవసర విచారణకు ఆదేశించారు.

జ్వి కోగన్ ఎవరు?

28 ఏళ్ల రాయబారి అయిన జ్వి కోగన్.. మోల్డోవన్ గుర్తింపు పత్రాల ప్రకారం యూఏఈలో నివసిస్తున్నారు. ఆయన తన భార్య రివ్కీతో కలిసి అబుదాబిలో నివసిస్తున్నారు. కోగన్ ఒక కోషర్ కిరాణా దుకాణాన్ని కూడా నడుపుతున్నారు. యూఏఈలోని చాబాద్ హసిడిక్ ఉద్యమానికి రాయబారిగా ఉన్న ఆయనను ఇజ్రాయెల్‌లో ఖననం చేశారు.          

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com