అల్ అరీన్ వైల్డ్‌లైఫ్ పార్క్ సరిహద్దులో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు..!!

- April 01, 2025 , by Maagulf
అల్ అరీన్ వైల్డ్‌లైఫ్ పార్క్ సరిహద్దులో గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు..!!

మనామా: బహ్రెయిన్‌లోని అల్ అరీన్ వైల్డ్‌లైఫ్ పార్క్ సమీపంలో ఒక విశాలమైన గోల్ఫ్ కోర్స్, విల్లా ఎస్టేట్ నిర్మించనున్నారు. ఈ మేరకు పర్యావరణ అధికారుల నుండి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలిపారు. దాదాపు 1.8 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ రానుంది. సెప్టెంబర్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు డెవలపర్లు తెలిపారు. దీనిని రెండు దశల్లో నిర్మించనున్నారు.  

మునిసిపల్ కౌన్సిలర్ హమద్ అల్ జౌబి ప్రకారం.. ప్రణాళికలలో కొంత భాగం రక్షిత వన్యప్రాణుల ఉద్యానవనంలోకి విస్తరించి ఉంటుంది. ఇది అరేబియా ఒరిక్స్, ఇసుక గజెల్ వంటి అరుదైన జీవులకు నిలయంగా ఉంది. వన్యప్రాణుల కారిడార్లను గోల్ఫ్ కోర్సు గుండా సఫారీ లాగా డిజైన్‌ను చేశారు.  స్థానిక మొక్కలను సంరక్షించడానికి ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించినదని అధికారులు తెలిపారు. ఈ పథకంలో ఎస్టేట్‌కు మద్దతుగా మురుగునీటి శుద్ధి కర్మాగారం, విద్యుత్ కేంద్రం, ఇతర మౌలిక సదుపాయాలు కూడా ఉన్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com