చైల్డ్ ఆర్టిస్ట్ టూ కోలీవుడ్ లీడ్ హీరోయిన్
- April 01, 2025
శ్రీదివ్య...ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన శ్రీదివ్య హీరోయిన్గా మంచి మంచి సినిమాలు చేసింది. గంపెడంత టాలెంట్ ఉండి కూడా.. స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కానీ ఆల్ ఆఫ్ సడెన్‌గా.. ఉన్నట్టుండి కోలీవుడ్ చెక్కేశారు. అక్కడే వరుస సినిమాలు చేసుకుంటూ.. చివరికి టాలీవుడ్‌కు దూరమైపోయారు. అయినా కానీ.. బార్డర్స్‌తో… స్టేట్స్తో సంబంధం లేకుండా..తన క్యూట్ అండ్ నేచురల్ లుక్స్‌తో.. సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతుంటారు. నేడు నటి శ్రీదివ్య పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం...
1993 ఏప్రిల్ 1న హైదరాబాదులో జన్మించింది. ఈమె అక్క శ్రీ రమ్య. తెలుగు, తమిళ్ సినిమాలలో కూడా నటించింది. ఇకపోతే మూడేళ్ల వయసు నుంచే సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. బాలనటిగా కెరియర్ ఆరంభించి తెలుగు, తమిళ సినిమాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 2006లో వచ్చిన ‘భారతి’ అనే తెలుగు సినిమాలో నటించిన ఈమె ..అందులో ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు అందుకుంది.
మూడేళ్ల వయసు నుంచే సినిమాలలో నటించడం మొదలుపెట్టింది. మొదట్లో తెలుగు టీవీ సీరియల్స్‌లో నటించిన ఈమె.. అలా శ్రావణ మేఘాలు , తూర్పు వెళ్ళే రైలు సీరియల్స్ లో నటించింది. ఆ తరువాత హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే లాంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.
ఆ తర్వాత హీరోయిన్గా 2010లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘మనసారా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత 2012లో మారుతి దర్శకత్వంలో వచ్చిన బస్ స్టాప్ సినిమాలో నటించిన ఈమె అది విజయం సాధించడంతో ‘మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు’ సినిమాలో కూడా నటించింది.. ఇక అంతే కాదు ‘కేరింత’ సినిమాలో కూడా నటించిన ఈమె.. ఎక్కువగా తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తుంది. ఆమె చివరిసారిగా కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం చిత్రంలో తళుక్కున మెరిసింది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్