ఏపీ: డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఎపి కేబినేట్ ఆమోద ముద్ర
- April 03, 2025
అమరావతి:ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను డీమెర్జ్ చేస్తూ ఎపి కేబినేట్ నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయంతో ఏపీడీసీ (ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్)ను ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్) నుంచి సపరేట్ చేసి.. స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేయనున్యనారు. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. నేడు వెలగపూడిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు అద్యక్షతన కేబినేట్ బేటి జరిగింది.. ఈ భేటిలో మొత్తం 23 అంశాలపై మంత్రులు చర్చించారు. ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణం, అమరావతితో పాటు పలు కీలక అంశాలపైనా ఈ మీటింగ్‌లో చర్చించారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం, అమరావతి పునర్నిర్మాణ పనులు, ప్రధాని మోదీ పర్యటనపై చర్చ సాగింది..
ఇక మంత్రి వర్గం ఆమోదించిన అంశాలు
- అనకాపల్లి జిల్లాలోని డీఎలపురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం.
- త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం.
- బార్ లైసెన్స్ ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ ఆమోదం.
- యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్ కు ఆమోదం.
- రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం.
- ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు-2025కి ఆమోదం.
- నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం.
- జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం.
- జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!