విధ్వంసంతో ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరు: సౌదీ క్రౌన్ ప్రిన్స్
- July 06, 2016
తీవ్రవాదులు విధ్వంసాలతో ప్రజల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేరని సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఇంటీరియర్ మినిస్టర్ మొహమ్మద్ బిన్ నాయెఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ చెప్పారు. దేశంలో భారీ కుదుపు కోసం తీవ్రవాదులు ప్రయత్నిస్తుంటారనీ, ఇలాంటి ఘటనలతో ప్రజలు అప్పటికప్పుడు భయాందోళనలకు గురైనా, ఆ తర్వాత అంతా ఒక్కటిగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే కసిని ప్రదర్శిస్తారనీ, ప్రభుత్వానికి ప్రజలు సహకరిస్తుండడంతో తీవ్రవాదుల ఆటల్ని కట్టించగలుగుతున్నామని ఆయన అన్నారు. భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదనీ, ఇంకా కఠినంగా తీవ్రవాదుల పట్ల వ్యవహరిస్తామనీ, పౌరులకు భద్రత కల్పించేందుకు ఇంకా ఏమేం చర్యల్ని అదనంగా తీసుకోవాలో అన్నీ చేస్తామని తెలిపారాయన. సౌదీలో జరిగిన మూడు పేలుళ్ళలో గాయాలపాలైన పోలీసు అధికారుల్ని, పౌరుల్ని ఆసుపత్రుల్లో పరామర్శించారు ప్రిన్స్ మొహమ్మద్. మదీనా, జెడ్డా మరియు ఖాతిఫ్లలో జరిగిన పేలుళ్ళలో మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారు, పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









