ఈ టిప్స్ పాటిస్తే బట్టతల రాదు...!
- April 04, 2025
ప్రజెంట్ హెయిర్ హెల్త్‌ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి, కాలుష్యం లాంటి సమస్యలతో త్వరగా జుట్టు రాలిపోతోంది. 30 ఏళ్లకే జుట్టు నెరిసిపోతోంది. ఇంకొందరికైతే బట్టతల వచ్చేస్తోంది. అందుకే మార్కెట్లో హెయిర్ హెల్త్‌కి సంబంధించి ఎన్నో ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. క్లెన్సర్స్, కండీషనర్స్.. ఇలా ఎన్నో ప్రోడక్ట్స్‌ని వాడేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అదే సమయంలో తరచూ ఆయిల్ అప్లై చేసే వాళ్లూ ఉంటారు.
సిల్కీ హెయిర్ ఉన్న వారు ఆయిల్‌నే ప్రిఫర్ చేస్తారు. ముందుగా నూనెని చేతులోకి తీసుకుని జుట్టుకి మసాజ్ చేయాలి. ఇది పూర్తిగా అబ్జార్బ్ అయ్యాక గంట, అరగంట ఆగి తలస్నానం చేస్తున్నారు. ఇది సాధారణంగా అందరూ ఫాలో అయ్యే ప్రాసెస్. అయితే.. నూనెని ఎలా పడితే అలా పట్టించి తలస్నానం చేసేస్తే త్వరగా జుట్టు రాలిపోతుందని చెబుతున్నారు ప్రముఖ హెయిర్ నిపుణులు. జుట్టుకి నూనె ఎలా రాసుకోవాలో ఓ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. ఇన్ని రోజులూ అంతా ఫాలో అవుతున్న పద్ధతి తప్పని, జుట్టు రాలకుండా ఉండాలంటే తాను చెప్పే టిప్స్ ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు
డ్రై హెయిర్‌కి నూనె రాయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరెప్పుడైనా గమనించారా. జుట్టుకి కండీషనర్ అప్లై చేసినా, సబ్బు రాసుకున్నా, షాంపూ పెట్టుకున్నా తడిగా అయిపోతుంది. అదే నూనె పెట్టుకుంటే మాత్రం డ్రైగానే ఉంటుంది అని, అందుకే అసలు జుట్టుకి నూనె ఎలా పెట్టుకుంటే మంచిదో కూడా తెలిపారు.
తడి జుట్టుపైనే నూనె రాసుకోవాలని సూచిస్తున్నారు. అంతే కాదు. నూనె రాసుకునే ముందు, తరవాత ఏం చేయాలో కూడా చెబుతున్నారు. జుట్టుకి నూనె రాయాలనుకున్న వారు ముందుగా గోరువెచ్చని నీటితో జుట్టుని తడపాలి. మరీ చల్లని, వేడి నీటితో జుట్టుని తడి చేసుకోకూడదు. గోరు వెచ్చని నీటితో తడిపిన తర్వాత నూనె రాసుకోవాలి. ఇదే సరైన పద్ధతి అని చెబుతున్నారు. అయితే.. చాలా మంది కొబ్బరి నూనె వాడుతుంటారు. అయితే.. ఆవాల నూనె జుట్టుకి చాలా మంచిదని, అందుకే.. గోరువెచ్చని నీటితో జుట్టుని తడి చేసుకున్న తర్వాత ఆవాల నూనె పట్టించాలని సూచించారు. నూనె పెట్టుకోవడం అయిపోయిన తర్వాత దువ్వుకోవాలి. 5 నిమిషాలు ఆగి షాంపూతో శుభ్రం చేసుకోవాలని చెప్పారు. రోజూ ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుందని చెబుతున్నారు.
హెయిర్ ఫాల్‌ని తగ్గించడంతో పాటు జుట్టు పెరిగేలా చేస్తుందంటూ కొన్ని ఆయిల్స్‌ని ప్రచారం చేస్తుంటారని, అందులో నిజం లేదని చెబుతున్నారు. ఇంట్లో రోజూ వాడుకునే ఉల్లిపాయలతోనే ఈ సమస్య నుంచి బయటపడే చిట్కా చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే "ఉల్లిపాయలు తీసుకోవాలి. వాటిని మెత్తగా జ్యూస్‌లా చేయాలి. ఆ తర్వాత జ్యూస్‌ని జుట్టుకి అప్లై చేసుకోవాలి. నూనె ఎలా అయితే రాసుకుంటారో అదే విధంగా ఈ జ్యూస్‌తో మసాజ్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే త్వరలోనే మంచి రిజల్ట్స్ చూడొచ్చు. ఉల్లిపాయలపై ఉండే పొరలు జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేస్తాయి".
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







