మతం మానవత్వం

- April 04, 2025 , by Maagulf
మతం మానవత్వం

అంతేలే  అంతేలే బీద ధనికులు                                                                                  అందరిని దూరం చేసుకునే మనసులు                                                                                  అంతటా బలవుతున్న మనుషులు. 

ఎవరికి ఎవరు శాశ్వతం 
ఎటువైపు పోతూ ఏమైపోతుంది సమసమాజం 
ఏమాత్రం మారని ఆలోచనా విధానం 
ఎలా ఉత్పన్నమవుతుంది కల్మషం..

ఎందరిలో వున్న రగిలించేరు మారణహామం 
ఎవరి జీవితమైన క్షణభంగురం 
ఎందులకీ మౌఢ్యంతో ప్రదర్శించేరు అహంకారం 
ఎప్పుడుషఎవరు ఎలా అయ్యేరో మటుమాయం ...

ఎప్పుడో తుంగలో తొక్కారు జ్ఞానం 
ఎందుకీ ఎగిసిపడే మిడి మిడి అజ్ఞానం 
చేసుకునేరు ఒకరినొకరు వంచన
సృష్టించేరు భీకరహారాహారి యుధ్ధపాతం....

ఇది కాదు కదా మహామహులు కన్నకలలు
ఎప్పుడు కులం మతం వాడి హోదా చూడు వీడిని చూడు 
అని పోతుంటే మనిషి చుట్టూరా మిగలరు ఆ నలుగురు 
నీవు చేసే మంచే నిర్ధారణ చేసేటి నీ మనుగడ...

ఎలా చేస్తావో అదే నీకు తిరిగి వస్తుంది 
ఎదలోతుల్లో దాగిన మానవత్వ పరిమళం బ్రతికించు
ఎదైన సంభవమే  అసంభవం కానిది ఏది లేదని గ్రహించు
ఎవరితోనైనా స్నేహం పూర్వకంగా మెలగు అదియే
నీదైన స్వధర్మం....

--యామిని కోళ్ళూరు(అబుధాభి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com