లేబర్ సిటీ ప్రాజెక్టు వేగవంతం..మంత్రి జలీబ్ అల్-షుయ్‌ఖ్ తనిఖీలు..!!

- April 08, 2025 , by Maagulf
లేబర్ సిటీ ప్రాజెక్టు వేగవంతం..మంత్రి జలీబ్ అల్-షుయ్‌ఖ్ తనిఖీలు..!!

కువైట్:లేబర్ సిటీ ప్రాజెక్టును వేగవంతం చేయాలని కువైట్ మునిసిపల్ వ్యవహారాల సహాయ మంత్రి, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రి అబ్దుల్లతీఫ్ అల్-మిషారీ ఆదేశించారు. జలీబ్ అల్-షుయ్‌ఖ్‌లో ఆయన స్వయంగా పరిస్థితులను పరిశీలించారు. ఆయనతో పాటు ఫర్వానియా గవర్నర్ షేక్ అత్బీ అల్-నాసర్, కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ మనల్ అల్-అస్ఫోర్, ప్రజా పనుల మంత్రిత్వ శాఖ అధికారులు ఉన్నారు.

ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న పట్టణ, ప్రణాళిక, భద్రత, నివాస పరిస్థితులను పరిష్కరించడానికి ప్రభుత్వం రాడికల్ పరిష్కారాలను అభివృద్ధి చేయడంలో ఆసక్తిగా ఉందని మంత్రి అన్నారు. ఫర్వానియా గవర్నర్ షేక్ అత్బీ అల్-నాజర్ అల్-సబాహ్ కూడా మాట్లాడుతూ..కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం, జాబర్ అంతర్జాతీయ స్టేడియం, కువైట్ విశ్వవిద్యాలయం వంటి ప్రాంతాల్లో మెరుగైన డెవలప్ మెంట్ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా మార్గాలలో రద్దీని తగ్గించడం , రియల్ ఎస్టేట్ దుర్వినియోగాన్ని తగ్గించడంతో పాటు, గుంతలను మరమ్మతు చేయడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, మురుగునీటి వ్యవస్థను పరిష్కరించడం వంటి అత్యవసర అత్యవసర ప్రణాళికను అభివృద్ధి చేయడం సిఫార్సులలో ఉన్నాయని  మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడు ఇంజనీర్ అలియా అల్ ఫార్సీ తెలిపారు. వీటిని అమలు చేయడానికి అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com