యూఏఈలో సోషల్ మీడియా ఉద్యోగ స్కామ్‌లు..హెచ్చరిక జారీ..!!

- April 08, 2025 , by Maagulf
యూఏఈలో సోషల్ మీడియా ఉద్యోగ స్కామ్‌లు..హెచ్చరిక జారీ..!!

యూఏఈ: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఉద్యోగ  ప్రకటనలకు ప్రాచుర్యం పొందాయి. అయితే, స్కామర్లు అధిక సాలరీలను ఇస్తామని చేసే నకిలీ ఉద్యోగ ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దాని డిజిటల్ సెక్యూరిటీ విభాగం ద్వారా ఈమేరకు హెచ్చరిక జారీ చేశారు. ఉద్యోగార్ధులను మోసం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించే మోసపూరిత కంపెనీల పెరుగుదల గురించి ప్రజలను హెచ్చరించారు.

"ప్రకటనలు, నియామకాలకు సోషల్ మీడియా కీలక వేదికగా పెరగడంతో నకిలీ కంపెనీలు మోసానికి పాల్పడుతున్నాయి. ఉద్యోగార్ధుల ఆకాంక్షలను దోపిడీకి వాడుకుంటున్నారు." అని డిజిటల్ సెక్యూరిటీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ మేజర్ సయీద్ అల్-షాబ్లి అన్నారు.  ఈ స్కామర్లు ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ప్రకటనలను పోస్ట్ చేసి ఉపయోగించుకుంటున్నారని, అనుభవం లేదా అర్హతలు అవసరం లేకుండా అధిక జీతాలను హామీ ఇచ్చే ఆకర్షణీయమైన ఉద్యోగ ఆఫర్‌లను ఇచ్చి, అమాయకులను దోచుకుంఉటన్నారని ఆయన వివరించారు. తాము సోషల్ మీడియా కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తున్నామని, వారు మరింత మంది బాధితులను మోసం చేయడానికి ముందే ఆయా ప్రకటనలను తొలగించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com