ఖతార్ వాణిజ్య బ్యాంకుల ఆస్తులు.. మొత్తం QR2.06 ట్రిలియన్లు..!!
- April 08, 2025
దోహా, ఖతార్: ఖతార్ సెంట్రల్ బ్యాంక్ (QCB) తాజాగా విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం, ఖతార్‌లో పనిచేస్తున్న వాణిజ్య బ్యాంకుల మొత్తం ఆస్తులు ఫిబ్రవరిలో QR2 ట్రిలియన్లకు పైగా పెరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో బ్యాంకింగ్ రంగంలో పరిణామాలు, కీలక బ్యాంకింగ్ రంగ సూచికలను QCB తన X ప్లాట్‌ఫామ్‌లో ఒక పోస్ట్‌లో వెల్లడించింది.
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొత్తం దేశీయ డిపాజిట్లలో వార్షిక ప్రాతిపదికన 1.2 శాతం పెరుగుదలతో QR855.5 బిలియన్లకు చేరుకుంది. ఫిబ్రవరిలో దేశీయ క్రెడిట్ సంవత్సరానికి 4.7 శాతం పెరిగి QR1.32 ట్రిలియన్లకు చేరుకుంది. ఖతార్ బ్యాంకింగ్ రంగంపై KPMG ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఆస్తుల పరంగా GCCలో అతిపెద్ద బ్యాంకుగా ఖతార్ నేషనల్ బ్యాంక్ తన స్థానాన్ని నిలుపుకుంది. గ్రీన్ బాండ్లు, రుణాలను జారీ చేయడం ద్వారా, వారు ఆర్థిక లాభాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చడంపై కూడా దృష్టి సారిస్తున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!