బహ్రెయిన్ లో కార్డ్ స్కామ్..BD31,000 చోరీ చేసిన సిస్టర్స్..!!
- April 09, 2025
మనామా: అరబ్ కు చెందిన ఇద్దరు సిస్టర్స్ విజిట్ వీసాలపై బహ్రెయిన్‌కు వచ్చి చోరీలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. మూడు నెలల్లోనే వారు గల్ఫ్ దేశం నుండి చోరీ చేసిన క్రెడిట్ కార్డ్ వివరాలను ఉపయోగించి BD31,000 కంటే ఎక్కువ విలువైన 77 మొబైల్ ఫోన్లను ఆర్డర్ చేయడంలో విషయం బయటకు వచ్చింది. వీరితోపాటు ఉన్న మరో వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అధికారులు తెలిపారు. అతను హ్యాక్ చేయబడిన బ్యాంక్ కార్డ్ డేటాను ఉపయోగించి ఆర్డర్లు ఇచ్చాడని పేర్కొన్నారు. డెలివరీలన్నీ బహ్రెయిన్‌లోని సిస్టర్స్ అడ్రస్ కు వెళ్లినట్లు విచారణ సందర్భంగా గుర్తించారు. ఫారీన్ పేమెంట్స్, లోకల్ డెలివరీలు భారీగా ఉండటంతో సమాచారం అందుకున్న అధికారులు విచారణ చేయగా స్కామ్ వివరాలు వెల్లడయ్యాయి. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేషనల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ ఆర్డర్లు సెప్టెంబర్, డిసెంబర్ 2024 మధ్య జరిగాయన్నారు. మొత్తం BD31,081.366 విలువైన వస్తువులను ఆర్డర్ చేసి తెప్పించుకున్నారని పేర్కొన్నారు. జరిగిన నేరాలను నిందితులు అంగీకరించారని తెలిపారు.
తాజా వార్తలు
- గోల్డ్ రూల్స్..క్లారిటీ కోరిన యూఏఈలోని ఇండియన్ కమ్యూనిటీ..!!
- ఖతార్ పై ఇజ్రాయెల్ దాడిని తప్పుబట్టిన UNSC..!!
- ముబారకియా మార్కెట్లో 20 దుకాణాలు మూసివేత..!!
- ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను ఖండించిన GCC, రష్యా..!!
- అరేబియా చిరుతపులి రక్షణకు మొబైల్ క్లినిక్..!!
- రీజినల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి
- YSR వారసుడిగా నా కొడుకే ..వైఎస్ షర్మిల
- ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
- నవంబర్ 20 నుంచి తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఫెస్టివల్