అల్ నహ్దా భవనంలో అగ్నిప్రమాదం...ఐదుగురు మృతి..!!
- April 14, 2025
షార్జా: షార్జాలోని అల్ నహ్దా ప్రాంతంలోని నివాస భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో .ఐదుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.మృతుడు 40 ఏళ్ల వయస్సు గల పాకిస్తానీ జాతీయుడని అధికారులు తెలిపారు.ఈ సంఘటనలో గాయపడిన వారు ప్రస్తుతం అల్ ఖాసిమి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని,వారి పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగినట్లు షార్జా సివిల్ డిఫెన్స్ తెలిపింది.
భవనంలోని అద్దెదారులు తిరిగి రావడానికి అనుమతి కోసం వేచి ఉన్నారు. టవర్ పై రెండు అంతస్తులలో మొదటగా మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సహారా సెంటర్‌కు ఎదురుగా ఉన్న ఈ భవనం ఎమిరేట్‌లోని ఎత్తైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందింది.
షార్జాలోని పారిశ్రామిక ప్రాంతం 15లో ఉన్న పండ్లు,కూరగాయల గిడ్డంగిలో కూడా అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!