షార్జా అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి..అది భయానకం..!!

- April 15, 2025 , by Maagulf
షార్జా అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి..అది భయానకం..!!

యూఏఈః షార్జాలోని అల్ నహ్దాలోని ఒక నివాస టవర్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించిన విషయం తెలిసిందే. అయితే, ఆ ప్రమాద దృశ్యాలు గుర్తొంచినప్పుడల్లా భయంతో వణికిపోతున్నట్లు స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  మంటల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న నివాసితులు, ఆ క్రమంలో ఒక వ్యక్తి పడిపోవడం చూసిన తర్వాత తాను రాత్రంతా నిద్రపోలేకపోయానని ఒక డెలివరీ బాయ్ చెప్పాడు. "మేము పొగను చూశాము. భవనం చుట్టూ గుమిగూడాము. ఇద్దరు వ్యక్తులు భవనం ముఖభాగం నుండి వైర్లను పట్టుకుని కిందకు జారడానికి ప్రయత్నించడం మేము చూశాము. ఒక వ్యక్తి విజయం సాధించాడు. అతను తన రెండు అరచేతుల చుట్టూ మందపాటి గుడ్డను చుట్టి సురక్షితంగా నేలకు చేరుకున్నాడు. మరొక వ్యక్తి కూడా అదే చేయడానికి ప్రయత్నించాడు. కానీ అతను విఫలమయ్యాడు. అతను తమ కండ్ల ముందే కిందపడి మరణించాడు. ఇది చూసి భయంతో వణికిపోయాము. నా చుట్టూ ఉన్నవారు అరిచారు. షాక్‌తో కేకలు వేశారు. ఇది భయానకంగా ఉంది. మేము నిస్సహాయంగా దానిని చూశాం." అని వివరించాడు.
ఎదురుగా ఉన్న భవనంలో నివసించే భారతీయ ప్రవాస రహేలా తన అనుభవాన్ని చెప్పారు. "నేను నా కుటుంబం అగ్నిమాపక యంత్రాల శబ్దానికి మేల్కొన్నాము. మేము బాల్కనీ నుండి బయటకు చూసినప్పుడు, భవనం  కిటికీ వద్ద ప్రజలు చేతులు ఊపుతూ సహాయం కోరుతున్నట్లు మేము చూశాం" అని ఆమె చెప్పింది. " మంటలు  దట్టమైన పొగ పెరగడం గమనించాము. వారిలో ఇద్దరు దూకారు. ఇద్దరు వైర్లు సాయంతో దిగడానికి ప్రయత్నించారు కానీ వారు చేయలేకపోయారు. నలుగురు పురుషులు నిమిషాల వ్యవధిలో పడి చనిపోయారని మేము చూశాము." అని ఆనాటి భయాకన సంఘటనను వివరించారు. తమ కుమారుడు ఈ సంఘటనల షాక్ నుండి ఇంకా కోలుకోలేదని ఆమె చెప్పారు.  
నివాస భవనం 44వ అంతస్తులో చెలరేగిన మంటల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనలో గాయపడిన వారు ప్రస్తుతం అల్ ఖాసిమి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com