2029 నాటికి QR158.05 బిలియన్లకు చేరుకోనున్న ఖతార్ నిర్మాణ పరిశ్రమ..!!

- April 17, 2025 , by Maagulf
2029 నాటికి QR158.05 బిలియన్లకు చేరుకోనున్న ఖతార్ నిర్మాణ పరిశ్రమ..!!

దోహా, ఖతార్: ఖతార్ నిర్మాణ పరిశ్రమ 2024లో QR127.88 బిలియన్ ($35.1 బిలియన్) నుండి 2029 చివరి నాటికి సుమారు QR158.05 బిలియన్ ($43.4 బిలియన్) కు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈమేరకు ఇది ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్ రీసెర్చ్ సంస్థలలో ఒకటైన రీసెర్చ్అండ్మార్కెట్స్ ఇటీవలి తన తాజా నివేదికలో వెల్లడించింది.  దాని "ఖతార్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డేటాబుక్ సిరీస్ - మార్కెట్ సైజు & ఫోర్కాస్ట్ బై వాల్యూ అండ్ వాల్యూమ్, Q1 2025" ప్రకారం.. ఖతార్‌లోని నిర్మాణ మార్కెట్ 2020 నుండి 2024 వరకు గణనీయమైన వృద్ధిని సాధించింది. 2.5 శాతం వార్షిక వృద్ధి రేటు (CAGR)ను సాధించింది. ఈ పెరుగుదల ధోరణిని బట్టి 2025 నుండి 2029 వరకు 3.3 శాతం CAGR ఉంటుందని భావిస్తున్నారు.

ఈ నివేదిక ఖతార్‌లోని నిర్మాణ రంగం సమగ్రమైన, డేటా ఆధారిత విశ్లేషణ ఆధారంగా నిర్ణయించినట్లు రీసెర్చ్ సంస్థ వెల్లడించింది.    ఖతార్ నిర్మాణ మార్కెట్ గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉందని, ఏటా 4.4 శాతం పెరుగుతుందని, 2025 నాటికి QR133.55 బిలియన్ ($36.7 బిలియన్) చేరుకుంటుందని నివేదిక తెలిపింది.  మార్చి 2025లో ఖతార్‌లో అమ్మకపు ఒప్పందాలలో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ పరిమాణం QR1.27 బిలియన్ (సుమారు $357.5 మిలియన్లు) చేరుకుందని, ఇది ఫిబ్రవరిలో QR1.29 బిలియన్ నుండి స్వల్ప తగ్గుదలను నమోదు చేసిందన్నారు.

ఖతార్ న్యాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రియల్ ఎస్టేట్ విశ్లేషణాత్మక బులెటిన్ నుండి తాజా డేటా ప్రకారం.. మార్చి నెలలో 283 రియల్ ఎస్టేట్ లావాదేవీలు నమోదయ్యాయి. ట్రేడెడ్ ఏరియా ఇండెక్స్ 14 శాతం పెరిగింది. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇండెక్స్ సూచించినట్లుగా, దోహా, అల్ రయాన్, ఉమ్ సలాల్ మునిసిపాలిటీలు ఆర్థిక లావాదేవీలకు ప్రముఖ ప్రాంతాలుగా నిలిచాయి. వాటి తర్వాత అల్ ధాయేన్, అల్ వక్రా, అల్ షమల్,  అల్ ఖోర్ మరియు అల్ ధకీరా ఉన్నాయి.

మార్చి 2025లో ఖతార్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇండెక్స్ ప్రకారం.. దోహా మునిసిపాలిటీలో మొత్తం ఆర్థిక లావాదేవీలు QR549 మిలియన్లకు చేరుకున్నాయి. అల్ రయాన్‌లో, లావాదేవీలు QR281.1 మిలియన్లు కాగా, ఉమ్ సలాల్ QR145.4 మిలియన్లు నమోదు చేసింది. అల్ ధాయేన్ లావాదేవీలు మొత్తం QR106.2 మిలియన్లు, అల్ షమల్ QR103.5 మిలియన్లు, అల్ వక్రా QR58.9 మిలియన్లుగా ఉన్నాయి.  అల్ ఖోర్ , అల్ ధకీరా QR32.6 మిలియన్లు విలువైన లావాదేవీలను నమోదు చేశాయని నివేదికలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com