భద్రతా ఉల్లంఘనలు..అల్-రాయ్ ఫెసిలిటీస్ మూసివేత..!!

- April 17, 2025 , by Maagulf
భద్రతా ఉల్లంఘనలు..అల్-రాయ్ ఫెసిలిటీస్ మూసివేత..!!

కువైట్: కువైట్ అగ్నిమాపక సేవా డైరెక్టరేట్.. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖల సహకారంతో అల్-రాయ్ ప్రాంతంలో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా భద్రత, అగ్నిమాపక నివారణ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారో లేదోనని పరిశీలించారు.  ప్రజా భద్రతను కాపాడటానికి, అగ్ని సంబంధిత సంఘటనలను నివారించడానికి జరుగుతున్న ప్రయత్నాలలో ఈ ప్రచారాలు భాగమని కువైట్ అగ్నిమాపక సేవా డైరెక్టరేట్ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠినంగా వ్యవహారిస్తామని,  జరిమానాలను విధించడంతోపాటు మూసివేస్తామని హెచ్చరించింది. ఆయా సంస్థల యజమానులు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com