సౌదీ అరేబియాలో ప్రైవేట్ టూరిజం దూకుడు.. 330% పెరిగిన ఫెసిలిటీ లైసెన్సులు..!!

- April 17, 2025 , by Maagulf
సౌదీ అరేబియాలో ప్రైవేట్ టూరిజం దూకుడు.. 330% పెరిగిన ఫెసిలిటీ లైసెన్సులు..!!

రియాద్: సౌదీ అరేబియాలో ప్రైవేట్ టూరిజం హాస్పిటాలిటీ ఫెసిలిటీ లైసెన్సులు 2023 సంవత్సరంతో పోలిస్తే 2024 సంవత్సరంలో 330 శాతానికి పైగా అసాధారణ వృద్ధిని నమోదు చేశాయని పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రైవేట్ టూరిజం హాస్పిటాలిటీ సౌకర్యాల కోసం జారీ చేయబడిన లైసెన్స్‌ల సంఖ్య 2023లో 1,900 నుండి 2024లో 8,300కి పెరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పెరుగుదల ఈ రంగం విస్తరణ,  రాజ్యంలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు పెరిగిన డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. సౌదీ అరేబియాలోని వివిధ ప్రాంతాలలో లైసెన్స్ పొందిన పర్యాటక ఆతిథ్య సౌకర్యాల సంఖ్య 4,425 కు చేరుకుందని పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రకటించింది. ఇది 2024తో పోలిస్తే 89 శాతం వృద్ధి రేటును సూచిస్తుందని పేర్కొన్నారు. సౌదీ పర్యాటక రంగంలో గణనీయమైన వృద్ధి, సందర్శకుల ప్రవాహం పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సేవలను పెంచాలనే మంత్రిత్వ శాఖ నిబద్ధతకు అనుగుణంగా లైసెన్స్‌లలో ఈ పెరుగుదల ఉందని మంత్రిత్వ శాఖ ప్రతినిధి మొహమ్మద్ అల్ రసాసిమా హైలైట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com