పోప్ రేసులో ఉన్న కార్డినల్స్ వీరే!
- April 22, 2025
క్యాథలిక్ అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ 88 ఏళ్ల వయసులో సోమవారం రోజు ఉదయం పలు అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పోప్ ఫ్రాన్సిస్ మృతి తర్వాత నుంచి కొత్త పోప్ ఎవరు అనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలీ ఎన్నిక ఎలా సాగుతుంది, ఈసారి పోప్‌గా ఎన్నికయ్యేందుకు ఎవరెవరు పోటీ చేసే అవకాశం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో క్యాథలిక్ లు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉన్నప్పటికీ చాలా కాలంగా కార్డినల్స్ నుంచే పోక్‌ను ఎన్నుకుంటూ వస్తున్నారు. అత్యంత రహస్యంగా సాగే ఈ ఎన్నికలో ఈ ఐదుగురు కార్డినల్స్ పోటీ చేయబోతున్నారని వీరిలోంచే ఒకరు పోప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
కార్డినల్ పీట్రో పరోలిన్
కార్డినల్ పీట్రో పరోలిన్ ఇటలీ దేశస్థుడు. అయితే పోప్ ఫ్రాన్సిస్ తర్వాత పోప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న, అందరూ ఇష్టపడే వ్యక్తి ఈయనేనని తెలుస్తోంది. ప్రస్తుతం 70 ఏళ్ల వయసు కల్గిన ఈయన గతంలో పోప్ సెక్రటరీగా పని చేశారు. దీంతో ఆయనకు వాటికన్‌తో పాటు దౌత్యపరమైన సంబంధాలు కూడా బాగానే ఉన్నాయి. ముఖ్యంగా చైనా, మిడిల్ ఈస్ట్ దేశాలతో కూడా పీట్రో పరోలిన్ సున్నితమైన చర్చల్లో పాల్గొన్నారు.
కార్డినల్ పీటర్ టర్క్సన్..
కార్డినల్ పీటర్ టర్క్సన్ ఘనా దేశానికి చెందిన వ్యక్తి. అయితే ప్రస్తుతం 76 ఏళ్ల వయసు కల్గిన ఈయనకు పోప్ ఫ్రాన్సిస్ వారసుడు అయ్యే అవకాశం ఉన్నట్లు అనేక మంది భావిస్తున్నారు. ఆఫ్రికాలో క్యాథలిక్ ల సంఖ్య పెరుగుతుడండంతో ఆ ఖండానికి చెందిన వ్యక్తినే పోప్‌గా నియమించాలన్న డిమాండ్లు వస్తుండగా పీటర్ టర్క్‌సన్‌కు ఈ అవకాశం దక్కుతుందని అనుకుంటున్నారు. కార్డినల్ పీటర్ టర్క్‌సన్‌కు హోమోసెక్స్, సామాజిక న్యాయం, ఎకాలజీ వంటి అంశాలపై లిబరల్ అభిప్రాయాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!