మే 1 నుంచి ఏటీఎం కొత్త రూల్స్..

- April 22, 2025 , by Maagulf
మే 1 నుంచి ఏటీఎం కొత్త రూల్స్..

మే 1 నుంచి ఛార్జీల మోతే.. ఈ తేదీ నుంచే ఏటీఎం కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ డబ్బు విత్ డ్రా కోసం ఏటీఎం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే, వారి మీకోసమే.. వచ్చే నెల నుంచి ఏటీఎం రూల్స్ మారబోతున్నాయి.

అంటే.. కొత్త ఏటీఎం ఛార్జీలు విధించనున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రతిపాదనను ఆర్బీఐ ఆమోదించిన తర్వాత ఇతర బ్యాంకు ఏటీఎంల నుంచి డబ్బును విత్ డ్రా చేసుకునేవారికి అదనపు ఛార్జీలు విధించనున్నారు.

మే 1, 2025 నుంచి మరో బ్యాంకు ATM నుంచి స్టేబుల్ లిమిట్ తర్వాత డబ్బును విత్‌డ్రా చేయడానికి (గతంలో రూ. 17 ఉండేది) ఇప్పుడు రూ. 19 అవుతుంది. అలాగే, బ్యాలెన్స్ చెక్ చేసేందుకు ఛార్జీని కూడా రూ. 7 నుంచి రూ. 9 కి పెంచారు. బ్యాంక్ కస్టమర్లకు మెట్రో నగరాల్లో 5 ఫ్రీ లావాదేవీలు, ఇతర మెట్రోయేతర నగరాల్లో 3 ఫ్రీ లావాదేవీల పరిమితిని ఇతర ఏటీఎంలలో ఒక నెలకు ఈ పెరిగిన ఛార్జీలు విధిస్తాయి.

పెరగనున్న ఏటీఎం ఛార్జీలు:
ఏటీఎం నెట్‌వర్క్ ఆపరేటర్లు, వైట్ లేబుల్ ఏటీఎం కంపెనీలు ఇంటర్‌చేంజ్ ఫీజును పెంచాలనే డిమాండ్ కారణంగా ఏటీఎం ఛార్జీలను పెంచాయి. నిర్వహణ, ఆపరేషన్ ఖర్చులు గతంలో కన్నా పెరిగాయి.

ఇలాంటి పరిస్థితిలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ డిమాండ్‌ను రిజర్వ్ బ్యాంక్ ముందు ఉంచింది. దాంతో ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏటీఎం ఛార్జీల పెరుగుదల ఇప్పుడు ఏటీఎం నెట్‌వర్క్ కోసం ఆధారపడే బ్యాంకులపై అధిక ప్రభావం పడుతుంది.

నాన్-హోమ్ బ్యాంక్ MTA నుంచి డబ్బును విత్‌డ్రా లేదా బ్యాలెన్స్ చెక్ చేసేందుకు యూజర్లు ఇప్పుడు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెరిగిన ఛార్జీల తర్వాత ఏటీఎం ఎక్కువగా ఉపయోగించే వ్యక్తులు అదనపు ఛార్జీలు పడకుండా ఉండేందుకు తమ హోమ్ బ్రాంచ్ ఏటీఎంని ఉపయోగించాలి లేదా డిజిటల్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

SBI ఇప్పటికే ఏటీఎం లావాదేవీలు, కస్టమర్లకు ఛార్జీలలో మార్పులు చేసింది. ఫిబ్రవరి 1, 2025 నుంచి వర్తిస్తుంది. కానీ, ఆర్బీఐ సూచనల ప్రకారం.. మే 1, 2025 నుంచి విత్‌డ్రాకు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి తప్పదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com