సెల్ఫీ రాజా' చిత్ర సాంగ్ విడుదల..

- July 07, 2016 , by Maagulf
సెల్ఫీ రాజా' చిత్ర సాంగ్  విడుదల..

వైవిధ్యమైన కామెడీ ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న నటుల్లో 'అల్లరి నరేష్' ఒకరు. మార్క్ కామెడీతో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. కొద్దికాలం గ్యాప్ తరువాత ఆయన 'సెల్ఫీ రాజా' చిత్రంలో నటిస్తున్నారు. సాక్షి చౌదరి, కామ్నా రానావాత్ జంటగా ఈశ్వర్ రెడ్డి దర్వకత్వంలో సుంకర రామబ్రహ్మం సమర్పణలో చిత్రం రూపొందుతోంది. చిత్ర సాంగ్ ను గురువారం విడుదల చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు మాట్లాడారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని, యాక్షన్ తో పాటు ఫుల్ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ తెలియ చేశారు. సెల్ఫీ రాజాకు ఓ సమస్య ఎదురవుతుందని, దాని నుండి బయటపడేందుకు రకరకాల గెటప్ లు వేస్తుంటాడని పేర్కొన్నారు. అల్లరి నరేష్ తో నటించడం వల్ల ఎంతో ఆనందంగా ఉందని, ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని సాక్షి చౌదరి పేర్కొంది. సెల్ఫీ ద్వారా అల్లరి నరేష్ సమస్య సృష్టిస్తుంటాడని, ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలని దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com