ఏపీ: శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపం ప్రారంభం
- April 23, 2025
గూడూరు: ఆధ్యాత్మిక గురువు బాబా రామ్ రతన్ జీ సేవలు చిరస్మరణీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.గూడూరు గ్రామంలోని వరాలసాయి మందిరంలో ఏర్పాటు చేసిన శిర్డీ సాయి శతాబ్ది మహాస్తూపాన్ని సోమవారం వైభవంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, మాజీ మంత్రులు మహీధర్ రెడ్డి, కాశిరెడ్డి, తెదేపా రాష్ట్ర నాయకులు కొనకళ్ల జగన్నాథరావు, డీసీ చైర్మన్ పోతన లక్ష్మీనరసింహస్వామి, పారిశ్రామికవేత్త ఉషాబాలకృష్ణన్ తదితరులు ప్రసంగించారు. గూడూరులో వరాలసాయి మందిరంతో పాటు వృద్ధాశ్రమం, కంటి ఆసుపత్రులు నిర్మించి సేవలందించడం ప్రశంసనీయమన్నారు. ఎంతో మంది ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేలా కృషి చేసిన మహనీయుడు రామ్ రతన్ జీ అని పేర్కొన్నారు. విశ్వగురు పీఠాధిపతులు విశ్వంజీమహరాజ్ ఆధ్వర్యంలో పలువురు వేద పండితులు పాల్గొని పూజలు చేశారు. ఆలయ నిర్వా హకులు పవన్ కుమార్, ఆధ్యాత్మిక గురువులు, భక్తులు పాల్గొన్నారు.ఈ ట్రస్ట్ బాధ్యతలు మాతాజీ, గుడ్లవల్లేటి పవన్ కుమార్ నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్