మిడిల్‌ ఈస్ట్‌ కార్గో డిమాండ్‌లో స్థిరత్వం

- July 08, 2016 , by Maagulf
మిడిల్‌ ఈస్ట్‌ కార్గో డిమాండ్‌లో స్థిరత్వం


 
మిడిల్‌ ఈస్ట్‌లో ఎయిర్‌ కార్గో డిమాండ్‌ మే నెలలో ఓ మోస్తరుగా ఉంది. గత ఏడాదితో పోల్చితే ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ తగ్గినా, మిడిల్‌ ఈస్ట్‌లో స్థిరంగా ఉందని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ వర్గాలు వెల్లడించాయి. మిడిల్‌ ఈస్టర్న్‌ క్యారియర్‌లో 3.2 శాతం డిమాండ్‌ పెరగ్గా, 9.5 శాతం కెపాసిటీలో పెరుగుదల కన్పించింది గత ఏడాదితో పోల్చినప్పుడు. వీక్‌ ట్రేడింగ్‌ కండిషన్‌లో డిమాండ్‌ కొంత తగ్గుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్త పరిస్థితులతో పోల్చితే మిడిల్‌ ఈస్ట్‌ కాస్త మెరుగ్గానే ఎయిర్‌ కార్గోలో పనిచేస్తున్నాయి. మేలో ఫ్రైట్‌ టన్‌ కిలోమీటర్స్‌ 0.9 శాతం తగ్గుదలను నమోదు చేసినట్లు ఐఎటిఎ పేర్కొంది. యూరోప్‌ మరియు మిడల్‌ ఈస్ట్‌ తప్ప, అన్ని రీజియన్లలోనూ ఫ్రైట్‌ డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com