ప్రపంచ మలేరియా దినోత్సవం
- April 25, 2025
హైటెక్ యుగంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇప్పటికీ ఏటా లక్షలాది మంది మలేరియా బారిన పడుతున్నారు. ఎంతోమంది చనిపోతున్నారు. దోమల నివారణ ద్వారానే మలేరియా వ్యాధిని అరికట్టాలి. మలేరియా వ్యాధి నివారణపై ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. నేడు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. . .
మలేరియా అనేది ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వచ్చే వ్యాధి. ఇది సోకిన ఆడ అనాఫిలిస్ దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఇది ప్రాణాంతక వ్యాధిగా మారింది. వర్షం లేదా వాతావరణంలో తేమ కారణంగా మలేరియా దోమలు పెరుగుతాయి. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి పిల్లలో ప్రాణాంతకంగా మారుతోంది.మలేరియా నిరోధక మందులు, క్రిమిసంహారక మందులు, దోమతెరల వాడకం ద్వారా వ్యాధిని నివారించవచ్చు. దోమల బెడదను నివారించడంతో మలేరియా నుంచి దూరంగా ఉండవచ్చు.
మలేరియా వచ్చిన వారి శరీరం తరచుగా చల్ల పడుతుంది. అధికంగా జ్వరం రావడమే కాకుండా రోగికి విపరీతంగా చెమటలు పడతాయి. ఇవే కాకుండా తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి, అతిసారం, రక్తహీనత, కండరాల నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొంతమంది మలేరియా రోగులల్లో మూర్ఛ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శరీరంలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదింస్తే మలేరియా నుంచి విముక్తి పొందవచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ 2007లో ప్రపంచవ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. ఆఫ్రికా దేశాల్లో తొలిసారిగా మలేరియా దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఆ సమయంలో ఆఫ్రికన్ దేశాలలో మలేరియా మరణాల ఎక్కువగా జరిగేవని, అక్కడ నివసిస్తున్న ప్రజలకు 2007నుంచి అవగాహన కల్పించడం వల్ల మరణాలు తగ్గుతూ వచ్చాయని డబ్లూహెచ్ఓ పేర్కొంది. అందుకే ప్రపంచ మలేరియా దినోత్సవం ప్రారంభించారని నిపుణులు చెబుతున్నారు.
'జీరో మలేరియా స్టార్ట్ విత్ మి' అనే థీమ్‌తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. . ఎంతో సైన్స్ పరిజ్ఞానం ఉన్న హైటెక్ రోజుల్లో కూడా మలేరియా వల్ల మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అసలు ఏ మందులు లేని కాలంలో అయితే లక్షలాది మంది ప్రాణాలు పోయాయి.
భారతదేశంలో 2024లో 33.8 లక్షల మలేరియా కేసులు, 5,511 మరణాలు నమోదయ్యాయి. 2023తో పోలిస్తే కేసులు 30శాతం తగ్గుదల, 34శాతం మరణాలు నమోదయ్యాయి. 2017తో పోలిస్తే, రోగులలో 49శాతం తగ్గింపు, మరణాలలో 50.5శాతం తగ్గుదల ఉంది. ఇది కాకుండా, 2015 – 2022 మధ్య మలేరియా కేసులు, మరణాలు వరుసగా 85.1శాతం, 83.6శాతం తగ్గాయి.
మలేరియా సోకిన రోగికి సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతక పరిణామాలు రావోచ్చు. ఈ మలేరియా వల్ల రోగి మెదడులోని రక్తనాళాల్లో వాపు, ఊపిరితిత్తులలో ద్రవం చేరడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలున్నాయి. వైద్య భాషలో దీనిని పల్మనరీ ఎడెమా(Pulmonary edema)అని అంటారు. ఇదే కాకుండా మలేరియా సోకిన వ్యక్తులకు కాలేయం, మూత్రపిండాలు వంటి ప్రధాన అవయవాలు చెడిపోయే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు తెలిపారు. దోమ వదిలిన పరాన్న జీవి ఎర్ర రక్త కణాలు దెబ్బతిసి రక్తహీనతకు దారితీస్తుంది. దీంతో రోగికి షుగర్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్