ఈ వారాంతంలో కువైట్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు..!!

- April 26, 2025 , by Maagulf
ఈ వారాంతంలో కువైట్ లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు..!!

కువైట్: కువైట్‌లో ఈ వారంతంలో పగటిపూట ఎండలు దంచికొడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశం ఉపరితల వాయుగుండం వల్ల వేడి గాలులు కొనసాగుతున్నాయని, ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్ముతో కూడిన వేడి గాలుల తీవ్రత అధికంగా ఉండవచ్చని డైరెక్టర్ దిరార్ అల్-అలీ తెలిపారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 40°C - 45°C మధ్య ఉండే అవకాశం ఉందన్నారు.  రాత్రి సమయాల్లో ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపారు. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు 21°C - 25°C మధ్య ఉంటాయన్నారు. మధ్నాహ్నం సమయాల్లో బహిరంగ కార్యకలాపాల సమయంలో ప్రజలు నీరు ఎక్కువగా తాగాలని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com