ఖతార్ ఆకాశం ఎందుకు నవ్వలేదు: వైరల్ అయిన 'స్మైలీ ఫేస్' హైప్ వెనుక నిజం..!!

- April 26, 2025 , by Maagulf
ఖతార్ ఆకాశం ఎందుకు నవ్వలేదు: వైరల్ అయిన \'స్మైలీ ఫేస్\' హైప్ వెనుక నిజం..!!

దోహా: గత కొన్ని రోజులుగా దోహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అరుదైన ఖగోళ సంఘటన గురించి చర్చ జరుగుతుంది. ఏప్రిల్ 25న తెల్లవారుజామున ఆకాశంలో “స్మైలీ ఫేస్” ఏర్పడింది. వైరల్ వాదన ప్రకారం చంద్రుడు, శుక్రుడు, శని ఒక స్మైలీ ఫేస్ లా కనిపిస్తారు. 

కానీ ఖతార్‌లోని చాలా మంది స్కైవాచర్లకు ఇది కనిపించకపోవడంతో వారంతా నిరాశ చెందారు. దీనిపై చర్చ మొదలైంది. "ఈ ఉదయం దోహాపై ఆకాశం ఎందుకు నవ్వలేదు?" అని చాలా మంది నివాసితులు కామెంట్స్ చేశారు.

ఈ వారం ప్రారంభంలో ఖతార్ క్యాలెండర్ హౌస్ (QCH) విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. చంద్రుడు, శుక్రుడు, శని ఉదయం 3:17 గంటల ప్రాంతంలో ఆకాశంలో కంటికి కనిపించాయి. అయితే,  ఇది ఒక మనోహరమైన అరుదైన దృశ్యం.  కానీ అది ఎప్పుడూ క్లాసిక్ స్మైలీ ఫేస్ ఎమోజి లాగా కనిపించలేదు. ఏప్రిల్ 23, 2025న QCH పోస్ట్ చేసిన ఫోటో "ఏప్రిల్ 25న తెల్లవారుజామున ఖతార్ తూర్పు ఆకాశంలో కనిపించింది." అని తెలిపింది. అందులో అవి స్మైలీ ఫేస్ లా మాత్రం కనిపించలేదని పేర్కొన్నారు.

కాగా,  చాలా మంది నివాసితులు ఆలస్యంగా మేల్కొని చూడటంతో అవి చాలామందికి స్మైలీ ఫేస్ మాదిరిగా కనిపించకపోవచ్చని,అవి బాగా పక్కకు జరిగి ఉన్నాయన నిపుణులు చెప్పారు.  తెల్లవారుజామున తురైనాపై చంద్రుడు, శుక్రుడు స్పష్టంగా కనిపించగా, శని మాత్రం అస్పష్టంగా కనిపించాడని ఖతార్‌కు చెందిన ఖగోళ ఫోటోగ్రాఫర్,  ఎవరెస్టర్ అబ్జర్వేటరీ వ్యవస్థాపకుడు అజిత్ ఎవరెస్టర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఫోటో మాత్రం బాగా ఎడిట్ చేసినదని ఆయన పేర్కొన్నారు. వాస్తవం దానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com