నాగచైతన్య, కార్తిక్ దండు కాంబోలో NC24..
- April 27, 2025
విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో నాగచైతన్యతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ మూవీ నాగచైతన్య కెరీర్ లో 24వది. ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త మైథలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు కార్తీక్ దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించి స్పెషల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. The Excavation Begins అంటూ రిలీజ్ చేసిన ఈ వీడియోలో సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్స్, నాగచైతన్య లుక్, ఇతర విషయాలు చూపించారు. ఆసక్తికర ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దిన వీడియో సినిమాపై హైప్ ను మరింత పెంచేసింది.
విరూపాక్ష సినిమాతో మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో తన ముద్ర వేసిన కార్తిక్ దండు ఈసారి చైతూతో చేతులు కలిపాడు. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని NC24 వర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్నారు. ఇదో సరికొత్త కాన్సెప్ట్ లా ఉంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
యంగ్ డైరెక్టర్ కార్తిక్ దండు రచయితగా కెరీర్ ప్రారంభించాడు. తర్వాత భమ్ బోలేనాథ్ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు. ఆ తర్వాత దర్శకుడిగా చాలా ఏళ్లు గ్యాప్ ఇచ్చిన కార్తీక్.. విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!