ATM 2025.. కొత్త అనుభవాలతో ‘ఎయిర్ ఇండియా’ పెవిలియన్..!!

- April 27, 2025 , by Maagulf
ATM 2025.. కొత్త అనుభవాలతో ‘ఎయిర్ ఇండియా’ పెవిలియన్..!!

దుబాయ్: దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (DWTC)లో ఏప్రిల్ 28 నుండి మే 1 వరకు జరగనున్న అరేబియన్ ట్రావెల్ మార్కెట్ (ATM) 2025లో ఎయిర్ ఇండియా,  ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పాల్గొంటుంది.  హాల్ 8లోని ఆసియా పెవిలియన్‌లోని AS7290 మరియు AS7295 బూత్ నంబర్లలో తన ఆధునిక వ్యవస్థలను ప్రదర్శించనున్నారు. 

100 చదరపు మీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ల సంయుక్త డిజిటల్-ఫస్ట్ విధానంతో రూపొందించబడిన ఈ పెవిలియన్ ఆకర్షణీయమైన వర్చువల్ రియాలిటీ (VR) జోన్‌ను కలిగి ఉంటుందని ప్రకటించారు. ఇక్కడకు వచ్చే సందర్శకులు ఎయిర్ ఇండియా అత్యాధునిక A350 విమానంలోకి అడుగుపెట్టి దాని ప్రత్యేకతలను స్వయంగా చూసే అవకాశం ఉందన్నారు. అలాగే కొత్తగా అప్‌గ్రేడ్ చేసిన 787-9 డ్రీమ్‌లైనర్, A321 క్యాబిన్‌లను సందర్శించవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com