మళ్లీ మానస్ సరోవర్ యాత్ర ప్రారంభం

- April 27, 2025 , by Maagulf
మళ్లీ మానస్ సరోవర్ యాత్ర ప్రారంభం

గతంలో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, ఇతరత్రా కారణాలతో నిలిచిపోయిన మానస్ సరోవర్ యాత్రను కేంద్రం తిరిగి ప్రారంభిస్తోంది. చైనాతో తాజాగా మెరుగుపడుతున్న సంబంధాలు, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి మానస్ సరోవర్ యాత్రకు అనుమతిస్తామని ఇవాళ విదేశాంగశాఖ ప్రకటించింది. అలాగే ఈ యాత్రకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరాలు కూడా వెల్లడించింది.

సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలతో యాత్ర రద్దు
2020లో చివరి సారిగా మానస్ సరోవర్ యాత్ర జరిగింది. ఆ తర్వాత కరోనా రావడం, సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు పెరగడం వంటి కారణాలతో ఈ యాత్రను రద్దు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత తిరిగి మానస్ సరోవర్ యాత్రను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు వరకూ కైలాస్ మానస్ సరోవర్ యాత్ర నిర్వహిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ఏడాది 750 మంది యాత్రికుల్ని అనుమతిస్తామని తెలిపింది.

యాత్రికులతో కూడిన ఐదు బ్యాచ్‌లు

గత ఏడాది అక్టోబర్‌లో చైనాతో కుదిరిన ఒప్పందం ప్రకారం డెమ్‌చోక్, డెప్సాంగ్‌లోని మిగిలిన రెండు ఘర్షణ ప్రదేశాల వద్ద రెండు దేశాలు సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాల్ని బలోపేతం చేసుకునేందుకు ఈ యాత్రను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే కైలాష్ మానసరోవర్ యాత్ర జూన్ నుండి ఆగస్టు 2025 వరకు జరగనుందని కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది 50 మంది యాత్రికులతో కూడిన ఐదు బ్యాచ్‌లు, 50 మంది యాత్రికులతో కూడిన 10 బ్యాచ్‌లు వరుసగా లిపులేఖ్ పాస్ వద్ద ఉత్తరాఖండ్ రాష్ట్ర క్రాసింగ్ ఓవర్ ద్వారా, నాథు లా పాస్ వద్ద సిక్కిం రాష్ట్ర క్రాసింగ్ ఓవర్ ద్వారా ఈ యాత్రకు వెళ్తాయిని విదేశాంగశాఖ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com