హజ్ యాత్రికుల కోసం 44 టన్నుల వైద్య సామగ్రి..SFDA

- April 27, 2025 , by Maagulf
హజ్ యాత్రికుల కోసం 44 టన్నుల వైద్య సామగ్రి..SFDA

జెడ్డా : సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) 1446 హజ్ సీజన్ కోసం మొదటి వైద్య రవాణాకు అనుమతి ఇచ్చింది. దీని బరువు 44 టన్నులు. అవసరమైన మందులు, వైద్య ఉత్పత్తులు ఇందులో ఉన్నాయని తెలిపింది. మదీనాలోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఈ సరుకు, హజ్ యాత్రికుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడంలో కీలకమైన అడుగుగా పేర్కొన్నారు. దిగుమతి చేసుకున్న అన్ని ఆహారం, ఔషధం, వైద్య ఉత్పత్తులు కఠినమైన భద్రత, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని వెల్లడించింది. జెడ్డాలోని కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, మదీనాలోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి కీలకమైన ప్రవేశ ప్రదేశాలలో ప్రత్యేక SFDA బృందాలు 24/7 పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com