కొత్త మోటార్ సైకిల్ టెస్ట్ రైడింగ్ లో విషాదం.. యూఏఈ బైకర్ మృతి..!!
- April 27, 2025
యూఏఈ: కొత్త మోటార్ సైకిల్ టెస్ట్ రైడింగ్ లో విషాదం చోటుచేసుకుంది.. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో యూఏఈ బైకర్ సయ్యద్ ఒమర్ రిజ్వీ మృతి చెందాడు. ఆయన మృతి పట్ల యూఏఈ బైకింగ్ కమ్యూనిటీ సంతాపం వ్యక్తం చేసింది. "మేము కేవలం ఒక ఉద్వేగభరితమైన బైకర్‌ను మాత్రమే కాదు, ఒక అద్భుతమైన ఆత్మను కోల్పోయాము." అని పాకిస్తాన్ రైడర్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు మీర్జా ఖుద్ అన్నారు. 45 ఏళ్ల పాకిస్తానీ ప్రవాసికి భార్య, 18 ఏళ్ల కుమారుడు, 14 ఏళ్ల కుమార్తె ఉన్నారు.
ఏప్రిల్ 23న రిజ్వీ కొత్త మోటార్ సైకిల్‌ను డెలివరీ తీసుకుని ఖోర్ఫక్కన్ హైవేపై టెస్ట్ రైడ్ కోసం వెళ్లగా.. అక్కడ అతని బైక్ రోడ్డుపై స్కిడ్ అయి ప్రమాదానికి గురైంది. అతన్ని షార్జాలోని అల్ ధైద్ ఆసుపత్రికి తరలించారు. అయితే, మరుసటి రోజు ఉదయం అంటే ఏప్రిల్ 24న ఆయన మరణించారు. కాగా, ఏప్రిల్ 22-24 తేదీల్లో మోటార్ ప్రమాదాల్లో మరణించిన సంఘటనల్లో ఇది మూడో ప్రమాదం.
2022లో మాజీ భారత కాన్సులేట్ ఉద్యోగి అయిన 37 ఏళ్ల జపిన్ జయప్రకాష్ ఏప్రిల్ 22న జరిగిన మోటార్ సైకిల్ ప్రమాదంలో మరణించారు. మరుసటి సంవత్సరం, ఏప్రిల్ 23, 2023న హాక్స్ MC గ్లోబల్ వ్యవస్థాపకుడు, బైకర్లలో 'ది గాడ్‌ఫాదర్' అని ప్రేమగా పిలువబడే 49 ఏళ్ల విస్సామ్ జెబియన్ దుబాయ్‌లో జరిగిన సోలో ప్రమాదంలో మరణించారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్