బహ్రెయిన్ కింగ్ యొక్క రాయల్ పార్డన్

- July 08, 2016 , by Maagulf
బహ్రెయిన్ కింగ్ యొక్క రాయల్ పార్డన్

పాకిస్తానీ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, 559 మంది ఖైదీలకు రాయల్ పార్డన్ లభించినట్లు వెల్లడించింది. కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఈద్ అల్ ఫితర్ సందర్భంగా వీరికి క్షమాభిక్ష పెట్టారు. క్షమాభిక్ష పొందినవారిలో 82 మంది పాకిస్తానీయులు ఉన్నారు. 69 మంది భారతీయులకు క్షమాభిక్ష లభించింది. పాకిస్తానీ అంబాసిడర్ జావెద్ మాలిక్ వ్యక్తిగతంగా పాకిస్తానీ ఖైదీలను మే 2016లో పరామర్శించి, వారికి క్షమాభిక్ష ఇవ్వాల్సిందిగా కింగ్ హమాద్కి విజ్ఞప్తి చేశారు. ఆ ప్రయత్నాలు సఫలమయ్యాయి. ఇంకో వైపున, భారతదేశ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, 69 మంది భారత ఖైదీలకు క్షమాభిక్ష పెట్టినందుకుగాను బహ్రెయిన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. క్షమాభిక్ష పొందినవారు సత్ప్రవర్తనతో వ్యవహరించాల్సిందిగా మినిస్ట్రీ సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com