బహ్రెయిన్ లో కార్మికులను సత్కరించిన క్యాపిటల్ గవర్నర్..!!
- May 01, 2025
మానామా: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్యుత్తమ సేవలను అందించిన కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాపిటల్ గవర్నర్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ రషీద్ అల్ ఖలీఫా పాల్గొన్నారు. కార్మికులకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. కార్మికుల సేవలను కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక బంధాలను పెంపొందించడానికి, కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని పెంచడంలో కీలకంగా ఉంటాయని తెలిపారు. గవర్నరేట్ ఉద్యోగుల అంకితభావం, అర్థవంతమైన సహకారాలకు గుర్తింపుగా వారికి మెమోంటోలు అందజేశారు. డిప్యూటీ క్యాపిటల్ గవర్నర్ హసన్ అబ్దుల్లా అల్ మదానీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా బహ్రెయిన్ నిరంతర అభివృద్ధికి కార్మికులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని హెచ్ఈ షేక్ రషీద్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!