ఒమన్ కైట్ ఫెస్టివల్.. జూలై 15న ప్రారంభం..!!

- May 07, 2025 , by Maagulf
ఒమన్ కైట్ ఫెస్టివల్.. జూలై 15న ప్రారంభం..!!

మస్కట్: ఒమన్ సెయిల్‌తో కలిసి ఒమన్ కైట్ ఫెస్టివల్ 2025ను ప్రారంభించినట్లు ఒమన్ టూరిజం డెవలప్‌మెంట్ కంపెనీ (ఒమ్రాన్ గ్రూప్) ప్రకటించింది.  జూలై 15-24 బార్ అల్ హిక్మాన్ నుండి ప్రారంభమై రాస్ అల్ హాడ్‌లో ముగుస్తుందని తెలిపింది.  ఈ ఫెస్టివల్ ఒమన్ పర్యాటక స్థాయిని మరింత ముందుకు తీసుకువెళుతుందని ఒమ్రాన్ గ్రూప్‌ మేనేజర్ సుల్తాన్ సులైమాన్ అల్ ఖుదూరి అన్నారు. ఇది పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. ఒమన్ తీరప్రాంత పర్యావరణాల వైవిధ్యాన్ని ప్రతిబింబించే గొప్ప పర్యాటక ఆకర్షణను అందిస్తుందని పేర్కొన్నారు.

ఒమన్ సెయిల్‌లోని ఈవెంట్స్ స్పెషలిస్ట్ షైమా సయీద్ అల్ అస్మి మాట్లాడుతూ.. ఈ ఫెస్టివల్ ఒమన్‌లో సముద్ర క్రీడల అభివృద్ధిలో ఒక ప్రధాన మైలురాయిగా పేర్కొన్నారు. అంతర్జాతీయ కైట్‌సర్ఫింగ్ లోపాల్గొనడం ఉత్సవానికి కొత్త అనుభవాన్ని అందిస్తుందన్నారు. వాటర్ ఆధారిత సాహస పర్యాటకానికి అగ్ర గమ్యస్థానంగా ఒమన్ స్థానాన్ని బలపరుస్తుందని పేర్కొన్నారు.

ఈ ఫెస్టివల్ పలు-దశల "డౌన్‌వైండర్" రేసుతో సహా అనేక రేసులు ఉంటాయని, ఇది నాలుగు దశల్లో.. బార్ అల్ హిక్మాన్ నుండి మాసిరా ద్వీపం వరకు, మాసిరా నుండి రాస్ అల్ రువైస్ వరకు, తరువాత పింక్ లగూన్స్ నుండి అల్ అష్ఖారా వరకు, చివరకు రాస్ అల్ జింజ్ నుండి రాస్ అల్ హాడ్ వరకు జరుగుతుందని ప్రకటించారు.  ప్రధాన కార్యక్రమానికి అనుబంధంగా బార్ అల్ హిక్మాన్‌లో కైట్ కోర్స్ రేస్, మాసిరా ద్వీపంలో కోస్టల్ రేస్, రాస్ అల్ హాడ్‌లో స్లాలొమ్ రేస్ వంటి అదనపు పోటీలు ఉంటాయని తెలిపారు.  ఈ ఫెస్టివల్ ప్రత్యేక కార్యకలాపాల గురించిన సమాచారం తెలియజేసేలా అష్ఖరా మున్సిపల్ పార్క్‌లో ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com