116 మంది కార్మికులను బహిష్కరించిన బహ్రెయిన్..!!

- May 07, 2025 , by Maagulf
116 మంది కార్మికులను బహిష్కరించిన బహ్రెయిన్..!!

మనామా: ఏప్రిల్ 27- మే 3 మధ్య వర్క్, రెసిడెన్సీ చట్టాల అమలుకు సంబంధించి 784 తనిఖీలు నిర్వహించినట్టు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ప్రకటించింది.  ఈ సందర్భంగా మొత్తం 18 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. అదేసమయంలో మొత్తం 116 మంది కార్మికులను బహిష్కరించినట్టు అథారిటీ తెలిపింది. అన్ని గవర్నరేట్‌లలోని వాణిజ్య సముదాయాలలో తనిఖీలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. తనిఖీలలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జాతీయత, పాస్‌పోర్ట్‌లు నివాస వ్యవహారాలు (NPRA),  గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ పాల్గొంటున్నాయని తెలిపారు.  

ఆర్థిక , సామాజిక భద్రతకు హాని కలిగించే ఏవైనా ఉల్లంఘనలు జరుగకుండా అన్ని ప్రభుత్వ సంస్థలతో సమన్వయంతో తనిఖీలు కొనసాగుతున్నాయని అథారిటీ వెల్లడించింది.  అథారిటీ వెబ్‌సైట్ www.lmra.gov.bh లోని ఎలక్ట్రానిక్ ఫారమ్ ద్వారా లేదా 17506055 నంబర్‌లో అధికార కాల్ సెంటర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా ప్రభుత్వ ఫిర్యాదుల వ్యవస్థ (తవాసుల్) ద్వారా చట్టవిరుద్ధమైన కార్మికుల వివరాలను తెలియజేయాలని, ప్రభుత్వ సంస్థల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని LMRA  పిలుపునిచ్చింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com