ఆపరేషన్ సిందూర్.. అనేక విమానాశ్రయాలు మూసివేత, విమానాలు రద్దు..!!

- May 07, 2025 , by Maagulf
ఆపరేషన్ సిందూర్.. అనేక విమానాశ్రయాలు మూసివేత, విమానాలు రద్దు..!!

కువైట్: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తల నేపథ్యంలో విమాన కార్యకలాపాలు ఇరు దేశాలు  నిలిపివేశారు. దీని వలన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది.  ఈ క్రమంలో ధర్మశాల (DHM), లేహ్ (IXL), జమ్మూ (IXJ), శ్రీనగర్ (SXR), అమృత్‌సర్ (ATQ) వంటి కీలక విమానాశ్రయాలలో విమాన కార్యకలాపాలను భారత్ నిలిపివేసింది.  ప్రయాణీకులు విమానయాన సంస్థలతో తమ విమానాల స్థితిని తనిఖీ చేసుకోవాలని సూచించారు. 

భారత జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్‌పూర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్,  రాజ్‌కోట్ నగరాలకు విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  అమృత్‌సర్‌కు వెళ్లే రెండు అంతర్జాతీయ విమానాలను కూడా ఢిల్లీకి మళ్లించారు. ఎయిర్‌ఫీల్డ్ మూసివేయబడినందున ఈరోజు శ్రీనగర్ విమానాశ్రయం నుండి ఎటువంటి పౌర విమానాలు నడపబడవని అధికారులు తెలిపారు.

ఇటీవల ఖతార్ కూడా పాకిస్థాన్ కు తమ సర్వీసులను రద్దు చేసింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రయాణీకులు, సిబ్బంది భద్రత తమ ప్రధాన ప్రాధాన్యతగా ఉందని ఎయిర్‌లైన్ తెలిపింది. బాధిత ప్రయాణీకులు qatarairways.com లో రియల్-టైమ్ అప్‌డేట్‌లను తనిఖీ చేయాలని లేదా +974 4144 5555 నంబర్‌లో ఎయిర్‌లైన్ సపోర్ట్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com