మెడిసిన్ రవాణా పేరిట 40 కిలోల కొకైన్ స్మగ్లింగ్..!!
- May 10, 2025
జెద్దా: జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ ద్వారా 40 కిలోగ్రాముల కొకైన్‌ను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని సౌదీ అరేబియా జకాత్, పన్ను మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) భగ్నం చేసింది. మెడిసిన్ గా ప్రకటించిన షిప్ మెంట్లో మాదకద్రవ్యాలను దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు.
ZATCA ప్రకారం.. షిప్ మెంట్ పై అనుమానం రావడంతో అధునాతన భద్రతా స్క్రీనింగ్, డిటెక్షన్ డాగ్‌లతో తనిఖీలు చేశారు.దాంతో అందులో కొకైన్ దాచినట్లు గుర్తించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ సమన్వయంతో ఈ ఆపరేషన్ ను నిర్వహించారు.
ప్రత్యేక హాట్‌లైన్ ద్వారా అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడం ద్వారా అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో జాతీయ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను జాక్టా కోరింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!