భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ.. స్వాగతించిన యూఏఈ..!!
- May 11, 2025
యూఏఈ: భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటనను యూఏఈ స్వాగతించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA)లోని వ్యూహాత్మక కమ్యూనికేషన్ల డైరెక్టర్ అఫ్రా అల్ హమేలి తెలిపారు. కాల్పుల విరమణ దక్షిణాసియా అంతటా భద్రత మరియు స్థిరత్వాన్ని పెంపొందించడానికి సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసిందని అల్ హమేలి తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగ ఇరు దేశాల నాయకత్వాన్ని ప్రశసించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో జరిగిన దౌత్య ప్రయత్నాలపై ప్రశంసించింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటాయని మంత్రిత్వ శాఖ విశ్వాసం వ్యక్తం చేసింది. ఇది విస్తృత ప్రాంతీయ స్థిరత్వానికి మద్దతు ఇచ్చే దశగా అభివర్ణించింది. ఈ నిర్ణయం రెండు దేశాల ప్రజలకు దీర్ఘకాలిక స్థిరత్వం, అభివృద్ధి, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తుందని మంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్