32 దెబ్బతిన్న జెట్ స్కీలు సీజ్.. అద్దె కంపెనీలకు హెచ్చరికలు జారీ..!!

- May 11, 2025 , by Maagulf
32 దెబ్బతిన్న జెట్ స్కీలు సీజ్.. అద్దె కంపెనీలకు హెచ్చరికలు జారీ..!!

యూఏఈ: దుబాయ్ పోలీసులు ఇటీవల నిర్వహించిన తనిఖీలలో తీవ్రంగా దెబ్బతిన్న లేదా గతంలో ప్రమాదాలకు గురైన 32 జెట్ స్కీలను స్వాధీనం చేసుకున్నారు.  ఇవి ఆపరేషన్‌కు పనికిరానివిగా మారాయని పేర్కొన్నారు.

దుబాయ్ ఫిషింగ్ పోర్ట్ 3లో పనిచేస్తున్న జెట్ స్కీ అద్దె కంపెనీలను లక్ష్యంగా క్షేత్ర తనిఖీలు చేపట్టినట్లు దుబాయ్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సముద్ర భద్రతను పెంచడానికి, సముద్ర వాహన అద్దె రంగాన్ని నియంత్రించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో ఈ తనిఖీలు భాగమి ప్రకటించారు.  

లైసెన్స్ లేని మెరైన్ వాహనాన్ని లేదా ఎమిరేట్ జలాల్లో నడపడానికి అధికారం లేని వాహనాన్ని నడిపినందుకు జరిమానా కింద Dh5,000 అని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.  లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత మెరైన్ వాహనాన్ని ఉపయోగించి దానిని పునరుద్ధరించకపోతే Dh1,000 జరిమానా విధించబడుతుందని తెలిపింది. పనికిరాని మెరైన్ వాహనాలను అద్దెకు ఇచ్చే కంపెనీలపై Dh5,000 జరిమానా విధిస్తామని, అదే సమయంలో ఇన్స్పెక్టర్లు తమ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవడం లేదా నిరోధించడం చేస్తే Dh5,000 జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.

జెట్ స్కీ అద్దె కార్యాలయాలు జెట్ స్కీలు, మెరైన్ పరికరాల పరిస్థితిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, అద్దెకు ముందు.. తరువాత భద్రత, భద్రతా చర్యలను తనిఖీలు చేయాలని సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com