బహ్రెయిన్ లో ఘనంగా జరిగిన 'ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ' వేడుకలు
- May 14, 2025
మనామా: ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో వైభవంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ వేడుకలు బహరైన్ లొ NRI తెలుగు దేశం మరియు NBK సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 500 పైగా అభిమానుల సమక్షంలో అధారి పార్కులో అత్యద్భుతంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు తనయుడు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి.జనార్ధన్, ప్రముఖ సినీ నటి కళారత్న ప్రభ రమేష్, నందమూరి బెనర్జీ, నందమూరి బిజిలి, స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కే పట్టాభిరామ్, ఆర్య వైశ్య కమిటి చైర్మన్ డూండి, తెలుగు యువత రాష్ట్ర అదికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, ప్రముఖ గాయకులు రాము & నాద ప్రియ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
అతిథులను ఈ కార్యక్రమంలో శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.బహ్రెయిన్ తెలుగు దేశం కార్య వర్గ సభ్యులు, ఇతర తెలుగు సంస్థలు, తెలుగు ఎకో వారియర్స్, సహయ సహకారాలతో ఈ వేడుకల నిర్వాహణ జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, తెలుగుదేశం పోలిట్‌బ్యూరో సభ్యులు టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ - మన అన్నగారి శతజయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని ప్రతి దేశంలో జరుపుకుంటున్నాం. జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కథా నాయకుడు, మహా నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు అని కీర్తించారు. రాజకీయ, సినీ రంగాల్లో చెరగని ముద్ర వేశారు అన్నగారు. మనకు రాముడు, కృష్ణుడు తెలుసు, అలాగే రావణ శకం తెలుసు, శాలివాహన రాజులు తెలుసు. ఆ తర్వాత తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునేది, గుండెల్లో పెట్టుకునేది ఎన్టీఆర్ నే. ఆయన తన సినిమాల ద్వారా మంచి సందేశాన్ని సమాజానికి అందించారు. ఎన్టీఆర్ గారు సినిమాల్లో నటించేవారు అనేకన్నా జీవించారు అని చెప్పడం కరెక్ట్. రాజకీయాల్లో ఆయన ఏం చెప్పారో అదే చేశారు. ప్రజా నాయకుడిగా మనసులు గెల్చుకున్నారని అన్నారు.
నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ...ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించిన బహ్రెయిన్ తెలుగు దేశం సభ్యులకు కృతజ్ఞతలు. సినీరంగంలో ఎన్టీఆర్ ఖ్యాతిని మరో నటుడు అందుకోలేరు. ఆయన తను నటించే పాత్రల్లో జీవించేవారు.ఆ క్యారెక్టర్స్ ను అర్థం చేసుకునేవారు. ఒక్కో సినిమాలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి కూడా ప్రేక్షకుల్ని మెప్పించారు. మరో నటుడికి సాధ్యం కాని ఎన్నో ఘనతలు ఎన్టీఆర్ వెండితెరపై సుసాధ్యం చేశారు. కుటుంబంలో శుభకార్యాల కంటే ప్రజల క్షేమమే ముఖ్యం అని ఎప్పుడు చేప్పేవారని తెలియ చేశారు.తన అన్న బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడు అని కళా రంగంలోనే కాకుండా సేవా రంగం, రాజకీయ, వైద్య రంగాల్లో కూడా అనేక గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారని తెలియ చేశారు.
ప్రముఖ నటి ప్రభ మాట్లాడుతూ...ఎన్టీఆర్ హీరోయిన్ ను అయినంత మాత్రాన నా పై ఇంత ప్రేమ, గౌరవం చూపిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు అందరికీ కృతజ్ఞతలు.టి.డి.జనార్ధన్ నన్ను గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమానికి పిలిచారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా.ఎన్టీఆర్ జీవితంలోని ఎన్నో విశేషాలతో తారకరామం అనే పుస్తకం రాయడం అభినందనీయం. ఎన్టీఆర్ గారు నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రలతో ప్రేక్షకుల్లో మనసుల్లో చిరస్మరణీయులు అయ్యారు. ఆయన రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా..ఇలా ఎన్నెన్నో పౌరాణిక పాత్రలతో గుర్తుండిపోయారు.ఎన్టీఆర్ పిల్లలు కూడా ఆయన వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. పురంధేశ్వరి ఢిల్లీ రాజకీయాల్లో గొప్ప స్థాయిలో ఉండటం మనందరికీ గర్వకారణం.
స్వచ్ఛ ఆంధ్ర చైర్మన్ కే పట్టాభిరామ్ గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయకత్వంలో ఎటువంటి మచ్చ లేని, నిజాయితీ తో కూడిన రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా తెలుగు ఈకో వారియర్స్ ఆధ్వర్యంలో 65 వారాల గా స్వచ్ఛ భారత్ స్ఫూర్తి తో ప్రతి శుక్రవారం బీచ్ లలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం చేస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు.
ఆర్య వైశ్య కమిటి చైర్మన్ డూండి రాకేష్ గారు మాట్లాడుతూ ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదల తో పని చేసే నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు అని, ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో యువత ఉపాధి పెరుగుతుంది అని కొనియాడారు. బాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కు శ్రీ పొట్టి శ్రీరాములు గారు కారణం ఐతే తెలుగు వారి ఉనికిని చాటి చెప్పిన నాయకుడు శ్రీ రామారావు గారని చెప్పారు.
తెలుగు యువత రాష్ట్ర అదికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా, యువత కి ఉపాధి దొరకాలన్నా తెలుగుదేశం నిరంతరం అధికారం లో ఉండాలని, మరోసారి అధికారం లోకి రావడానికి మనమంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రతిపక్షాల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పారు
NRI తెలుగు దేశం గల్ఫ్ అధ్యక్షులు రావి రాదాక్రిష్ణ గారు మాట్లాడుతూ గత ఎన్నికల విజయం లో NRI ల పాత్ర అభినందనీయం అని ఎన్నికల కోసం సొంత డబ్బులతో ఆంధ్ర వచ్చిన ప్రతి ఒక్కరినీ అభినందించారు
NRI తెలుగు దేశం గల్ఫ్ కమిటీ సభ్యులు కోడూరి వెంకట్ గారు మాట్లాడుతూ తెలుగు వారి జీవితాల్లో వెలుగులు నిలిపిన అన్న NTR గారికి వెంటనే భారత రత్న ఇవ్వాలని కోరారు. అధికారం కోసం కష్టపడ్డ NRI లకు కూడా పార్టీ లోను, ప్రభుత్వం లోను సముచిత స్థానం ఇస్తే పూర్తి సేవాభావం తో ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియ చేశారు.
ఈ కార్యక్రమం నిర్వహించిన NRI TDP బహ్రెయిన్ అధ్యక్షులు రఘునాథ్ బాబు గారు, హరిబాబు తక్కెల్లపాటి గారు,RSS మురళి కృష్ణ, కొత్తపల్లి రాజ శేఖర్, DV శివ కుమార్, రామ్ మోహన్ కొత్తపల్లి, అనిల్ ఆరె, సతీష్ శెట్టి, ఉన్నగిరి పూర్ణ, అంబటి నాగార్జున బాబు, ఇంతియాజ్, సతీష్ బోల్ల, AV రావు, PJ నాయుడు, చంద్ర బాబు, అనిల్ పమిడి, నోముల మురళి, మురళి క్రిష్ణ, యుగందర్, గణపర్తి అశోక్, ప్రవీణ్ చావా, మహేష్ మీరా, స్వాతి, స్రవంతి, ఉషారాణి, వంశీ, సందీప్, హరిప్రియ, శ్రీకాంత్, శ్రీ వాణి, కోటేశ్వరరావు వింతల, విరించి రియల్ ఎస్టేట్ మరియు అమరావతి అవెంజర్స్ క్రికెట్ టీం సభ్యులు అందరినీ ప్రతి ఒక్క అతిధి ప్రత్యేకంగా అభినందించారు.
పిల్లలు తో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.
ఈ కార్యక్రమాన్ని NRI వింగ్ గ్లోబల్ నెట్వర్క్ వైస్ ఛైర్మన్ అశ్విన్ అట్లూరి పర్యవేక్షణలో anna NTR అనే youtube చానెల్ ద్వారా లైవ్ ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!