గోదావరి పుష్కరాలు ప్రారంభం
- July 13, 2015
రెండు తెలుగు రాష్ర్టాల్లో గోదావరి పుష్కరాలు వైభవంగా ఆరంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. రాజమండ్రిలోని పుష్కర ఘాట్లో చంద్రబాబు స్నానమాచరించారు. ఈరోజు నుంచి ఈ నెల 25వ తేదీ వరకు గోదావరి మహా పుష్కరాలు సాగనున్నాయి. టీటీడీ తరపున గోదావరికి చీర, సారెలను చంద్రబాబు సమర్పించారు. అనంతరం సీఎం బాబు పుష్కర ఘాట్లను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో పుష్కరాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం గోదావరిలో కేసీఆర్ పుష్కరస్నానం ఆచరించారు. కొవ్వూరులో గోష్పాద క్షేత్రంలో భక్తులు పోటెత్తారు. కొవ్వూరులో కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పుష్కరస్నానం ఆచరించి పుష్కరాలను ఆరంభించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







