45 కిలోలు తగ్గి.. ప్రతి కిలోకు 300 దిర్హామ్ లు గెలుచుకున్న అమృత్ రాజ్..!!

- May 22, 2025 , by Maagulf
45 కిలోలు తగ్గి.. ప్రతి కిలోకు 300 దిర్హామ్ లు గెలుచుకున్న అమృత్ రాజ్..!!

దుబాయ్: దుబాయ్ లో ఉండే భారతదేశానికి చెందిన అమృత్ రాజ్.. రస్ అల్ ఖైమా వెయిట్ లాస్ ఛాలెంజ్ 2025 విజేతగా నిలిచాడు. బహుమతిని గెలుచుకోవడానికి అతను ఏకంగా 45.7 కిలోల బరువు తగ్గాడు. దాంతో అతనికి 13,800 దిర్హామ్ లు బహుమతిగా లభించింది. మహిళా విభాగంలో పాకిస్తాన్ ప్రవాసురాలు స్పినా ఘటై మొహమ్మద్ యాకూబ్.. 25 కిలోల బరువు తగ్గి మహిళల ఛాంపియన్ గా నిలిచారు.

నిర్వాహకులు తెలిపిన ప్రకారం.. ఈ సంవత్సరం ఎడిషన్‌లో యూఏఈ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 24,289 మంది పాల్గొన్నారు.  

"నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లావుగా ఉండేవాడిని. నాకు 100 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నట్లు గుర్తు లేదు. నేను అధిక బరువుతో ఉన్నప్పుడు కూడా ఆమె నన్ను వివాహం చేసుకోవాలని ఎంచుకుంది. కాబట్టి ఈ ప్రయాణం నా భార్యకు అంకితం." అని అమృత్ రాజ్ తెలిపాడు. బరువు తగ్గడం అనేది మనసుకు, దృష్టికి సంబంధించినది అని ఆయన అన్నారు. మీ మనస్సులో ఒక లక్ష్యం ఉండి, దృష్టి కేంద్రీకరించినట్లయితే, మీరు దానిని చేరుకుంటారని తెలిపారు. 

RAK బిగ్గెస్ట్ వెయిట్ లాస్ ఛాలెంజ్ 2025లో ఫ్యామిలీ కేటగిరీలో నియాజ్ హంజా పరప్పలత్, అతని కుటుంబం రన్నరప్‌గా నిలిచింది.  

RAK హాస్పిటల్ ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MOHAP) రస అల్ ఖైమా సహకారంతో ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ ను నిర్వహిస్తారు. అవార్డుల ప్రదానోత్సవంలో MSF ప్రతినిధి కార్యాలయం డైరెక్టర్ ఖలీద్ అబ్దుల్లా మొహమ్మద్ అల్ షెహి పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com