క్షమాభిక్ష ప్రకటించిన మలేషియా ప్రభుత్వం

- May 22, 2025 , by Maagulf
క్షమాభిక్ష ప్రకటించిన మలేషియా ప్రభుత్వం

మలేషియా: ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించింది.మే 19 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు జైలు శిక్షలు లేకుండా వారి స్వదేశాలకు వెళ్లవచ్చని హోమ్ మినిస్టర్ దాతుక్ సైఫుద్దీన్ ఇస్మాయిల్ తెలిపారు.ఈ క్షమాభిక్ష కాలంలో పాస్పోర్ట్ లేకుండా వున్నవాళ్లు,వర్క్ పర్మిట్ వీసాల గడువు ముగిసినవారు మలేషియా వదిలి వెళ్ళినట్లయితే వారు సాధారణ నియమ నిబంధనల అనుగుణంగా వ్యవహరిస్తే వారు మళ్ళి మలేషియా రావడానికి అనుమతించబడుతారు 

ఈ ఆమ్నెస్టీ  ద్వారా తమ స్వదేశాలకు వెళ్లే వారు 500 రింగ్గిట్ మలేషియా (ఇండియన్ కరెన్సి లో రూ  10000)  చెలించాల్సివుంది.అలాగే వారు పాసుపోర్టు, పాసుపోర్టు లేని వారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ మరియు సొంతంగా వారం రోజుల్లో వెళ్లే విధంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.  

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారితో సహా పెద్ద సంఖ్యలో భారతీయ కార్మికులు మలేషియా లో పనిచేస్తున్నారు, వేలాది మంది ఇక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్రమ కార్మికులుగా నివసిస్తున్నారు. ఏజంట్లు మంచి జీతం తో కూడిన ఉద్యోగం ఇస్తామని ఆశ చూపి ఈ కార్మికులను విజిట్ వీసా పైన తీసుకువచ్చి వర్క్ పర్మిట్ ఇవ్వకుండా మోస పోయిన వారు చాల మంది వున్నారు.ఈ కార్మికులు ఎక్కువగా పామ్ ఆయిల్ తోటలలో, రబ్బర్ తోటలలో, కన్స్ట్రక్షన్  మరియు హోటల్స్ లలో పని చేస్తున్నారు. 

ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదయినా సహాయం కావలిసిన వారు ఫెడరేషన్ ఆఫ్ NRI కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ను [email protected] or website http://www.fnca.com.my సంప్రదించాలని ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు.అలాగే ఈ ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియాలో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ మరియు ఆంధ్రా  ప్రభుత్వాలూ చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియాలో ఉంటున్న కార్మికులకు తెలుసే విధంగా తెలంగాణ ఆంధ్రా  ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com