యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!

- May 24, 2025 , by Maagulf
యూఏఈలో దశాబ్ద కాలంలో రికార్డు స్థాయిలో ‘మే’ ఉష్ణోగ్రతలు..!!

యూఏఈ: యూఏఈలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలకు సంబంధించి రికార్డ్ స్థాయిలో 50.4ºC ఉష్ణోగ్రత నమోదైందని, 2003లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) తెలిపింది. "దేశంలో అత్యధిక ఉష్ణోగ్రత 50.4°C (122.7 ఫారెన్‌హీట్) అల్ షావమేఖ్ (అబుదాబి)లో యూఏఈ స్థానిక సమయం 14.30 గంటలకు నమోదైంది. 2003లో మేము రికార్డులు ఉంచడం ప్రారంభించినప్పటి నుండి (మే నెలలో) నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే." అని Xలో ఒక పోస్ట్‌లో NCM పేర్కొంది. మే 2009లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 50.2ºCని అధిగమించిందని కేంద్రం తెలిపింది. ఏప్రిల్ నెలలో సగటున రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రత 42.6ºCతో రికార్డు స్థాయిలో అత్యంత వేడిగా నమోదైందని తెలిపింది. అది ఏప్రిల్ 2017లో నమోదైన సగటు రోజువారీ గరిష్ట స్థాయి 42.2ºCని అధిగమించిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండకు దూరంగా ఉండాలని, పుష్కలంగా లిక్విడ్స్ తాగాలని, తగిన దుస్తులు ధరించాలని, సన్‌స్క్రీన్ ఉపయోగించాలని సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com