యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!

- May 24, 2025 , by Maagulf
యూఏఈలో ఈద్ అల్ అధా ఎప్పుడు? జుల్ హిజ్జా మొదటి రోజు వెల్లడి..!!

యూఏఈ: త్యాగాల పండుగ అయిన ఈద్ అల్ అధా అతి త్వరలో రానుంది. ఈ సెలవుదినం దుల్ హిజ్జా తొమ్మిదవ రోజున వస్తుంది. హజ్ సీజన్ ముగింపును సూచిస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రమానం ఆధారంగా ఉన్నందున, సెలవులు ఇతర ఇస్లామిక్ సంఘటనల తేదీలు నెలవంక కనిపించడంపై ఆధారపడి ఉంటాయి. అయితే, ఖగోళ శాస్త్ర నిపుణుడు ఇబ్రహీం అల్ జర్వాన్ మాట్లాడుతూ.. ఖగోళ గణనల ఆధారంగా పండుగ ఏ రోజున వస్తుందో అంచనా వేశారు.
ఎమిరేట్స్ ఆస్ట్రోనామికల్ సొసైటీ ఛైర్మన్, అరబ్ యూనియన్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ స్పేస్ సైన్సెస్ సభ్యుడు అయిన అల్ జర్వాన్.. దుల్ హిజ్జా మొదటి రోజు మే 28 (బుధవారం) వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఖగోళ గణనల ఆధారంగా జూన్ 6న ఈద్ అల్ అధా అవుతుంది. మే 27 (మంగళవారం ) ఉదయం 7.02 గంటలకు యూఏఈలో దుల్ హిజ్జా అమావాస్య ఉంటుందని అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com