FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

- May 25, 2025 , by Maagulf
FNCA -మలేషియా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది పురస్కారాలు

కౌలాలంపూర్: ఫెడరేషన్ అఫ్ ఎన్.ఆర్.ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియా లో ఘనంగా జరిగాయి.మలేషియా కోలాలంపూర్ లోని MAB కాంప్లెక్స్ ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాసులు మరియు స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు.పిల్లలు తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా ఆడి పాడి సందడి చేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగు ఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు, పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్,BRS మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ ఆఫ్ ఎన్.ఆర్.ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

ఈ సారి ఉగాది పురస్కారాలు సమాజ సేవా కార్యక్రమాలను, కోవిడ్ లాక్ డౌన్ సమయంలో  మలేషియా లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన అసోసియేషన్ నాయకులకు మరియు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి కృషి చేసిన వారిని గుర్తించి వారిని గౌరవించే ఉగాది కీర్తి రత్న పురస్కారాలతో సత్కరించడం జరిగింది అని ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. 

జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆ తరువాత ఆపరేషన్ సిందూర్ లో అమరులైన జవాన్లకు మరియు పహల్గమ్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం ఒక్క నిమిషం పాటు మౌనం వహించి నివాళులు అర్పించారు. 

అనంతరం ఉగాది పురస్కారాలను ఈ కార్యక్రమ ముఖ్య అతిధులు చేతుల మీదుగా అందజేశారు. 

ఈ సంవత్సరం ఉగాది కీర్తి రత్న అవార్డు గ్రహీతలు వీరే 
 తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి  ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్,మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి విజయ శారద గరిమెళ్ళ ,వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణమూర్తి , సుబ్బారావు,తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీ రాములు సన్నాసి ,తొండ కృష్ణ మూర్తి చంద్రయ్య , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్,గువేంద్ర శ్రీనివాస్ రావు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు . 

అలాగే ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా 2025-2026 కి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 

నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు  

అధ్యక్షులు బూరెడ్డి మోహన్ రెడ్డి

సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని

ఉపాధ్యక్షులు రవి వర్మ కనుమూరి

ప్రధాన కార్యదర్శి శివ సానిక

సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి

కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి

యువజన విభాగ అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల

సాంస్కృతిక విభాగ అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి

కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు

కార్యనిర్వాహక సభ్యులు నాగార్జున దేవవరపు

కార్యనిర్వాహక సభ్యులు ఫణింద్ర కనుగంటి

కార్యనిర్వాహక సభ్యులు సురేష్ రెడ్డి మందడి

కార్యనిర్వాహక సభ్యులు రవితేజ శ్రీదాస్యాం

అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి

ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి

కార్యనిర్వాహక సభ్యులు సూర్య కుమారి

ఆ తర్వాత కార్యక్రమంలో ఆట పాటలతో ఆలరించిన చిన్నారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.అలాగే ఇటీవల మలేషియా ప్రభుత్వం ప్రకటించిన మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0  (PRM  2.0) ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం మే 19 నుంచి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుందని ఈ విషయాన్ని ఇతర సంఘాల ప్రతినిధులు వారి వారి అధికార ప్రసార  మాధ్యమాలలో దీని గురించి తెలియజేయాలని, ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదైనా సహాయం కావలసినవారు ఫెడరేషన్ అఫ్ ఎన్ ర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియాను [email protected] or http://website www.fnca.com.myసంప్రదించాలని ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు  అలాగే ఈ ఆమ్నెస్టీ సద్వినియోగం అయ్యే దిశగా మలేషియా లో ఉంటున్న కార్మికులను స్వదేశానికి చేరుకునేలా తెలంగాణ మరియు ఆంధ్ర ప్రభుత్వాలూ చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు, అలాగే ఈ కార్యక్రమం గురించి మలేషియా లో ఉంటున్న కార్మికులకు తెలిసే విధంగా తెలంగాణ ఆంధ్రా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణ ముత్తినేని,ఉపాధ్యక్షులు  రవి వర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతిక విభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహక సభ్యులు  నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం  అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి ,మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి, రజిని పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com