మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ బాసట..!!

- May 26, 2025 , by Maagulf
మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ బాసట..!!

కువైట్: మంగాఫ్ అగ్నిప్రమాద బాధితుల కుటుంబాలకు NBTC గ్రూప్ అధికారికంగా KD 618,240 (సుమారు INR 17.31 కోట్లు) విలువైన గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లను అందజేసింది. NBTC కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఎంబసీ, లులు ఎక్స్ఛేంజ్ గ్రూప్, NBTC మేనేజ్‌మెంట్ ప్రతినిధులు , ఉద్యోగులు పాల్గొన్నారు. గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కె. జి. అబ్రహం..మరణించిన 49 మంది ఉద్యోగుల చట్టపరమైన వారసులకు బీమా చెల్లింపులను అందజేశారు. బాధిత ఉద్యోగులకు 48 నెలల జీతానికి సమానమైన బీమా చెల్లింపును NBTC ఉద్యోగి సంక్షేమ పథకం కింద అందించారు. మిగిలిన ఉద్యోగుల కుటుంబాలను కలవడానికి NBTC మేనేజ్‌మెంట్ వచ్చే వారం భారతదేశానికి వెళ్లి అదనపు సహాయాన్ని అందిస్తుందని అబ్రహం ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com