ఒలెక్ర్టా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ లాభం రూ.20.69 కోట్లు

- May 27, 2025 , by Maagulf
ఒలెక్ర్టా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ లాభం రూ.20.69 కోట్లు

హైదరాబాద్: ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ర్టా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ (OGL) 2023-24 ఆర్థిక సంవత్స రం నాలుగో త్రైమాసికంలో రూ.448.92 కోట్ల ఆదాయంపై రూ.20.69 కోట్ల నికరలాభం ఆర్జించింది. ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 55%, లాభం 39% పెరిగాయి.ఈ త్రైమాసికంలో తాము 219 వాహనాలను డెలివరీ చేశామని, గత ఏడాది అందించిన 131 వాహనాలతో పోల్చితే ఇది 67% అధికమని కంపెనీ తెలిపింది. ఇప్పటికి మొత్తం 2,718 బస్సులను అందించినట్లు పేర్కొంది. ప్రస్తుతం తమ చేతిలో 10,022 బస్సుల సరఫరా ఆర్డర్లున్నట్టు తెలియచేసింది. మార్చి 31తో ముగిసిన ఏడాది కాలానికి ఒక్కో షేరుపై రాబడి (EPS) రూ.9.36 నుంచి రూ.16.92కి పెరిగినట్టు కంపెనీ సీఎండీ కేవీ ప్రదీప్‌ ప్రకటించారు. ఇదిలా ఉండగా 2024-25 ఆర్థిక సంవత్సరం మొత్తానికి కంపెనీ రూ.1801.9 కోట్ల ఆదాయంపై రూ.139.21 కోట్ల నికరలాభం ఆర్జించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com