ఇంట్లో గంజాయి సాగు.. డైవర్‌కు జైలు శిక్ష..!!

- May 28, 2025 , by Maagulf
ఇంట్లో గంజాయి సాగు.. డైవర్‌కు జైలు శిక్ష..!!

మనామా: అడ్లియాలోని రెండంతస్తుల ఇంటిలో గంజాయి సాగు చేసిన కేసులో నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. దాంతో మాదకద్రవ్యాల ముఠాకు అధిపతిగా పనిచేసిన ప్రొఫెషనల్ డైవర్‌తో పాటు ఇద్దరు సహచరులకు జీవిత ఖైదు విధించారు.  హై క్రిమినల్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి BD5,000 జరిమానా విధించింది. నాల్గవ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష, BD5,000 జరిమానా విధించగా, ఐదవ వ్యక్తికి ఒక సంవత్సరం జైలు శిక్ష, BD1,000 జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత 51 ఏళ్ల రింగ్‌లీడర్‌ను బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువులను జప్తు చేయాలని తీర్పునిచ్చింది.

డైవర్ ఆరు సంవత్సరాలుగా తన వృత్తిని కవర్‌గా ఉపయోగిస్తున్నాడని, తన నివాసం నుండి గంజాయి సాగు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆ ఫ్లాట్‌ నుంచి మొక్కలు, హీట్ ల్యాంప్‌లు, ఎరువులు, ఫ్యాన్‌లు, రాక్‌లను సిజ్ చేశామన్నారు. ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.. అతనికి ఉన్న పరిచయాలతో కొనుగోలుదారులకు అమ్మకాలు చేసవాడని తెలిపారు.  ఆర్డర్‌లను డెలివరీ చేయడానికి హ్యాండ్‌ఆఫ్‌లు, డ్రాప్ పాయింట్లను ఉపయోగించేవారని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com