తిరుమల: మెట్టు మార్గంలో చిరుత...భక్తుల్లో ఆందోళన
- June 02, 2025
తిరుమల: తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల్లో కలకలం మొదలైంది.500వ మెట్టు వద్ద ఓ చిరుత కనిపించిందన్న వార్త కలవరం రేపింది. పొదల మధ్య చిరుతని చూశామని కొందరు భక్తులు భద్రతా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.వెంటనే ఫారెస్ట్ (Forest) అధికారులు, భద్రతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే ఆ ప్రాంతంలో స్పష్టమైన చిరుత జాడలు మాత్రం కనిపించలేదు.అయినా ప్రమాదం తలెత్తకుండా అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు.చిరుత ఇంకా చుట్టుపక్కలే ఉందని అనుమానం వ్యక్తమవడంతో సైరన్లు వేశారు. దాంతో అది అడవిలోకి వెళ్లిపోయే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. భక్తులను అప్రమత్తం చేస్తూ, ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించాల్సిందిగా సూచించారు.పిల్లలు ఒంటరిగా వెళ్ళకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని చెప్పారు. ముఖ్యంగా పొదల దగ్గర ఆగకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
మరో రోజు మూర్తినాయన చెరువు వద్ద కూడా చిరుత
ఈ సంఘటనకు ముందురోజే శనివారం సాయంత్రం మరో చిరుత దర్శనం ఇచ్చింది. శిలాతోరణం సమీపంలోని మూర్తినాయన చెరువు ప్రాంతంలో అది సంచరించిందని అధికారులు తెలిపారు. అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
జనసంచారాన్ని పరిమితం చేసిన అటవీ శాఖ
చిరుతలు కనిపించిన ప్రదేశాల్లో భద్రతను పెంచారు. భక్తులు ఎక్కువగా ఉండే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఫారెస్ట్ శాఖ చెప్పింది. CCTV కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచారు.
భక్తులకు సూచనలు–భద్రతే ప్రథమం
తిరుమలకు కాలినడకన వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. పక్కదారులు తీసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా అనుమానం కలిగినా వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!
- దమ్మామ్‌లో ఫార్మా కంపెనీకి భారీ జరిమానా..!!
- యూఏఈలో 9 రోజులపాటు సెలవులు? విమాన ఛార్జీలకు రెక్కలు..!!
- కువైట్ లో అకాడమిక్ డిగ్రీలపై కఠిన చట్టాలు..ఇక జైలు శిక్ష..!!
- బెలారస్ కు బయల్దేరిన ఒమన్ సుల్తాన్..!!
- యుఎస్ నావల్ కమాండర్‌కు ఆర్డర్ ఆఫ్ బహ్రెయిన్ ప్రదానం..!!
- TCS ఉద్యోగుల తొలగింపు..