రెస్టారెంట్లోకి ప్రవేశించిన ఆరుగురు ప్రవాసులపై బహిష్కరణ వేటు..!!
- June 03, 2025
కువైట్: జులీబ్ అల్-షుయౌఖ్‌లో గతంలో సీజ్ చేసిన ఒక రెస్టారెంట్‌ను తెరిచిన కేసులో ఆరుగురు ప్రవాసులపై చర్యలు తీసుకున్నారు. వారిని బహిష్కరించినట్ల పేర్కొన్నారు. దీనిని గతంలో కువైట్ అగ్నిమాపక దళం సీలు చేసింది. మూసివేయబడిన రెస్టారెంట్‌ను చట్టవిరుద్ధంగా తిరిగి తెరిచారని నివేదిక అందిన తర్వాత రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగం అధికారులు వారిని అరెస్టు చేశారు. వారు వెనుక తలుపు ద్వారా ప్రవేశించి, రెస్టారెంట్ నుండి తమ వస్తువులను బయటకు తీసినట్లు గుర్తించారు.
అయితే, మూసివేసిన ఏదైనా ప్రాంగణంలోకి, ఎలా దేనికోసం ప్రవేశించినా, అది చట్టపరమైన ఉల్లంఘన అని అధికారులు చెప్పారు. ఏదైనా ఎంట్రీ పాయింట్ ద్వారా మూసివేత ఆదేశాలను దాటవేయడం ఖచ్చితంగా నిషేధించబడిందని అగ్నిమాపక దళ ప్రతినిధి ధృవీకరించారు. కువైట్ నిబంధనల ప్రకారం.. అటువంటి ఆదేశాలను ఉల్లంఘించే ప్రవాసులు బహిష్కరించబడతారని, అయితే కువైట్ పౌరులు, ఇందులో పాల్గొంటే, చట్టపరమైన చర్యల కోసం కోర్టులకు రిఫర్ చేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ వీకెండ్ లో కార్నిచ్ స్ట్రీట్ మూసివేత..!!
- కువైట్ లో రోడ్ బ్లాక్ కు భారీ జరిమానాలు..!!
- అల్-ఫలిహ్ నేతృత్వంలో మొరాకోకు సౌదీ ప్రతినిధి బృందం..!!
- బహ్రెయిన్‌లో SMS స్కామ్.. గైడ్ లైన్స్ రిలీజ్..!!
- ఒమన్ లో తజావోబ్ ప్లాట్ ఫామ్ ప్రారంభం..!!
- యూఏఈలో బివరేజేస్ పై షుగర్ ట్యాక్స్..!!
- 16న PM మోదీ చేతుల మీదుగా డ్రోన్ సిటీకి శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
- విశాఖలో మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేశ్
- సీఎం రేవంత్ చేతుల మీదుగా ఆర్టీఐ కొత్త లోగో
- దోహా నుండి సురక్షితంగా స్వదేశానికి ఇండియన్..!!