యూఏఈలో క్రిప్టోకరెన్సీలో జీతాలు, బిల్లులు, జరిమానాల చెల్లింపులు..!!
- June 04, 2025
యూఏఈ: యూఏఈలో క్రిప్టోకరెన్సీ వేగంగా రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారుతోంది. త్వరలో యుటిలిటీ బిల్లులు, కిరాణా సామాగ్రి, ట్రాఫిక్ జరిమానాలు చెల్లించవచ్చని, క్రిప్టోకరెన్సీలో జీతాలు కూడా పొందగలరని ఇండస్ట్రీ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా యువతరం ఈ సాంకేతికతపై ఆసక్తిని పెంచుతున్నందున, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలు రెండూ డిజిటల్ కరెన్సీలను వినియోగంలోకి తెచ్చేందుకు ముందువరుసలో ఉన్నాయి.
దుబాయ్ ఇటీవల ప్రభుత్వ సేవల కోసం క్రిప్టోకరెన్సీ చెల్లింపులను ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్ ఆర్థిక శాఖ, ప్రపంచ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన Crypto.com మధ్య ఒప్పందం కూడా జరిగింది. "దుబాయ్ నివాసితులు క్రిప్టోకరెన్సీని ఉపయోగించి ప్రభుత్వ సేవలకు చెల్లించడానికి అనుమతించాలనే నిర్ణయం ఈ సాంకేతికతను - పెట్టుబడి సాధనం నుండి ప్రభుత్వ రంగ యుటిలిటీగా - పునర్నిర్మించింది" అని బిట్ఓయాసిస్ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు ఓలా డౌడిన్ అన్నారు.
రోజువారీ జీవితంలో స్టేబుల్‌కాయిన్‌ల వినియోగాన్ని హైలైట్ చేస్తూ.. "అవి భవిష్యత్ ఆవిష్కరణలా అనిపించవచ్చు, కానీ అవి ప్రస్తుతం వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశాలలో, ప్రజలు తమ పొదుపు విలువను కాపాడుకోవడానికి స్టేబుల్కాయిన్లను ఉపయోగిస్తారు. ఇతరులు సాంప్రదాయ పద్ధతుల కంటే వేగంగా, తక్కువ ఖర్చుతో విదేశాలకు డబ్బు పంపడానికి వాటిపై ఆధారపడతారు." అని తెలిపారు.
యూఏఈలో క్రిప్టో కరెన్సీని ప్రాపర్టీ డెవలపర్లు, విమానయాన సంస్థలు, ఇంధన రిటైలర్లతో సహా అనేక కంపెనీలు క్రిప్టోకరెన్సీని చెల్లింపు రూపంగా అంగీకరించడం ప్రారంభించాయి. దుబాయ్ ఆర్థిక మౌలిక సదుపాయాలు, మల్టీ ఎక్స్ఛేంజీలు, సమగ్ర నిబంధనలు క్రిప్టో పేమెంట్ ను నడిపించే కీలక కారకాలు అని ఐసిఎం ప్రాంతీయ మేనేజర్ సాయి మహేష్ పేర్కొన్నారు. "నివాసితులు, వ్యాపారాలు వివిధ ప్లాట్‌ఫామ్‌లలో క్రమంగా క్రిప్టో చెల్లింపులను స్వీకరించడాన్ని నేను చూస్తున్నాను. రెస్టారెంట్లు సహా చాలా మంది చిన్న విక్రేతలు బిట్‌కాయిన్‌ను మాత్రమే కాకుండా ఎథెరియం వంటి ఇతర క్రిప్టోకరెన్సీలను కూడా అంగీకరించడం ప్రారంభించారు." అని మహేష్ అన్నారు. ముందుకు చూస్తే, జీతాలు కూడా డిజిటల్ కరెన్సీలలో చెల్లించబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!